ప్రైవేటు హాస్పిటళ్ళ దందా పై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆరోగ్య శ్రీ కింద ఉచిత చికిత్సల విషయంలో కృష్ణాజిల్లా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఆస్పత్రుల్లో కచ్చితంగా 50శాతం బెడ్లు కచ్చితంగా ఆరోగ్యశ్రీ పేషెంట్లుకు ఇవ్వాలి. వివిధ బీమా సంస్థల రేట్లతో పోలిస్తే.. మన ప్రకటించిన రేట్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ప్రకటించిన రేట్లకు కచ్చితంగా రోగులకు సేవలు అందాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నియంత్రణ, నిబంధనలు కచ్చితంగా అమలు కావాలి అన్నారు.
ఆరోగ్య మిత్రలు, సీసీ కెమెరాలు సమర్థవంతగా పనిచేయాలి. ఇవి సమర్థవంతంగా పనిచేస్తే ప్రైవేటు ఆస్పత్రులమీద దాడులు చేయాల్సిన అవసరం ఉండదు. దాడులు నిర్వహించిన తర్వాత అధికంగా ఛార్జీలు వసూలు చేసినందుకు తీసుకునే చర్యలు ముఖ్యమైనవి. అవకతవకలకు పాల్పడే ప్రైవేటు హాస్పిటళ్ళ పై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలి. 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే నేరుగా నాకు నివేదిక అందాలి అని తెలిపారు. కలెక్టర్లు ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి అని సీఎం పేర్కొన్నారు.