ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కామ్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇరికించేందకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారని తిరుపతి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తూ.. ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. లిక్కర్ స్కామ్ కేసులో తాము చెప్పినట్టు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డీజీపీ హరీష్కుమార్ గుప్తాకి…
అనకాపల్లి ల్యాండ్ పూలింగ్ అక్రమాల కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఇంటి స్థలాల కోసం గత ప్రభుత్వ హయాంలో డి-ఫారం పట్టా, ఆక్రమిత భూములను సమీకరణపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రశ్నించనుంది. ఇప్పటికే అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం నుంచి ముఖ్య డాక్యుమెంట్లు, రికార్డులను సీఐడీ స్వాధీనం చేసుకుంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాద్ ఎమ్మెల్యేగా వున్న సమయంలో జరిగిన భూసమీకరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే పీలాగోవింద్ ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం…
చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక పరిధిలోని నారాయణపురంలో మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. మహిళను చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చూడాలని సూచించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేశామని సీఎం ఎస్పీ తెలిపారు.…
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ ఏరియా తాత్కాలిక రెడ్ జోన్ పరిధిలోకి వచ్చింది. నేటి నుంచి 96 గంటల పాటు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నావల్ కోస్ట్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు ఆంక్షలు కొనసాగుతాయని వైజాగ్ సిటీ పోలీసు కమిషనర్ తెలిపారు. 5 కిలో మీటర్ల పరిధిలో ప్రైవేట్ డ్రోన్లను ఎగురవేయడం, నిరసనలు, ర్యాలీలు చేపట్టడం లాంటి కార్యక్రమాలను నిషేధిస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పు వసూలు చేసేందుకు మహిళను చెట్టు కట్టి, దాడి చేసిన అమానవీయ ఘటన కుప్పం పురపాలిక పరిధిలోని నారాయణపురంలో వెలుగు చూసింది. నారాయణపురానికి చెందిన తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పుల భారం భరించలేక ఊరు విడిచి పెట్టి వెళ్లిపోగా.. అతని భార్య శిరీష పుట్టిల్లు శాంతిపురం మండలం కెంచనబల్లలో ఉంటూ..…
ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయనికి సీఎం చంద్రబాబు.. కొన్ని కీలక శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న మంత్రి నారా లోకేష్.. ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నారా లోకేష్.. ఇవాళ, రేపు ఢిల్లీలోనే ఉండనున్న లోకేష్ ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ కుటుంబానికి రాష్ట్రం ప్రభుత్వం ప్రకటించిన రూ.50 లక్షల రూపాయల చెక్కును నేడు అందజేయనున్న రాష్ట్ర మంత్రి సవిత నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్న…
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా హాట్ కామెంట్స్ చేశారు. ఇది మంచి ప్రభుత్వం కాదని.. ముంచే ప్రభుత్వం అని విమర్శించారు. 143 హామీలతో పాటు సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పి.. ఒక పథకంను కూడా అమలు చేయడానికి వారికి మనసు రాలేదని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు సూపర్ అమలు చేశామని చెప్పడంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉలిక్కిపడ్డారన్నారు. ఒక్క పథకంను అమలు చేయకుండా, ఒక్క అభివృద్ధి పని చేయకుండా.. అన్ని చేశామని చంద్రబాబు చెప్పడంపై…
సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ పర్యటించనున్న నేపథ్యంలో యోగాంధ్ర 2025 ఏర్పాట్లను సీఎం స్వయంగా పరిశీలించారు. విశాఖ ఆర్కే బీచ్ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి.. పలు సూచనలు చేశారు. యోగాంధ్ర ఏర్పాట్లు, వీఐపీల భద్రత తదితర అంశాలపై అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. భద్రత ఏర్పాట్లను సీఎంకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేకంగా వివరించారు. సీఎం వెంట మంత్రులు నారా లోకేష్,…
ఏపీలో గ్రామ/వార్డ్, సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. గ్రామ/వార్డ్, సచివాలయ ఉద్యోగుల రేషనలైజెషన్ తర్వాత ప్రభుత్వం బదిలీలు చేస్తోంది. ఒకే చోట ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేస్తే.. బదిలీ తప్పనిసరి అని ఉత్తర్వులు జారీ చేసింది. 5 సంవత్సరాలు కాలం పూర్తికాని వారు వ్యక్తిగత అభ్యర్థన మేరకు బదిలీకి అర్హులుగా పేర్కొంది. ఉద్యోగికి తన సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వకూడదని స్పష్టం చేసింది. దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు, భార్యా భర్తలు ఒకే…
విశాఖ వేదికగా యోగాంధ్ర-2025ను విజయవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ వంటి ప్రముఖులు అంతర్జాతీయ యోగాడేలో పాల్గొనున్నారు. ప్రధాన వేదికగా ఆర్కే బీచ్ ఎంపిక చేశారు. వర్షాలు లేదా భద్రత కారణాల వల్ల మార్పు చేయాల్సి వస్తే.. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ సిద్ధం అయింది. 3.5 లక్షల నుంచి ఐదు లక్షల మంది…