ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ ప్రారంభం అయింది. అయితే కేబినెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశం నుంచి వెళ్లిపోయారు. తల్లి అంజనా దేవి అనారోగ్యానికి గురయ్యారన్న సమాచారంతో పవన్ వేంటనే కేబినెట్ నుంచి బయల్దేరారు. సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చి హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు.
Also Read: Crime News: పెందుర్తిలో పెను విషాదం.. కొడుకు, కూతురుతో బావిలో దూకిన తల్లి!
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి ఈరోజు ఉదయం అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. అంజనా దేవి అస్వస్థతతో మెగా కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురైయ్యారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదు. గతంలో కూడా అంజనా దేవి పలుమార్లు అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో అడ్మిట్ అయి.. కొన్నిరోజులకు కోలుకున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని మెగా హీరోల ఫాన్స్ కోరుకుంటున్నారు.