అమరావతి : కోవిడ్ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై ఇవాళ క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా థర్డ్ వేవ్ పై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 104 ద్వారా పిల్లలకు చికిత్స 24 గంటలూ అందుబాటులోకి పీడియాట్రిక్ టెలీ సేవలు తీసుకు రావాలని..అలాగే 150 మంది పీడియాట్రిషియన్లు టెలీ సేవలు నిర్వహించాలని పేర్కొన్నారు. ముందు పీడియాట్రిషియన్ల అందరికీ శిక్షణ ఇప్పించాలని… ఎయిమ్స్‌లాంటి అత్యుత్తమ సంస్ధల నిపుణుల సేవలను వినియోగించుకోవాలని…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వివాదం మళ్లీ రాజుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండగా.. మరోవైపు ఫిర్యాదుల పర్వం కూడా కొనసాగుతోంది. ఈ నీటి వివాదంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ… తెలంగాణ మంత్రులు విమర్శలు చేస్తున్నారు. ”వైఎస్ రాజశేఖర్ రెడ్డి దొంగ అయితే… సీఎం జగన్ గజ దొంగ” అన్న సందర్భాలు ఉన్నాయి. అటు ఏపీ మంత్రులు కూడా అదే స్థాయిలో తెలంగాణ ప్రభుత్వపై…
ఏపీ ప్రభుత్వంపై మరోసారి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పాదనను అడ్డుకునేలా ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడం దారుణమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. శ్రీశైలం ప్రాజెక్టు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం హైడెల్ పవర్ ప్రాజెక్టేనని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం హైడెల్ పవర్ పై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడం పరిపాటిగా మారిందని… కృష్ణా బోర్డు అనేక అంశాల్లో చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ట్రిబ్యునల్…
ఏపీకి భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి ఋతుపవనాల ఉత్తర పరిమితి బార్మర్, భిల్వారా, ధోల్పూర్, అలీఘడ్, మీరట్, అంబాలా మరియు అమృతసర్ గుండా వెళుతుం దని పేర్కొన్న వాతావరణ శాఖ.. దక్షిణ ఒడిశా & పరిసరాలపై ఇతర ఉపరితల ఆవర్తనము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ & తీరప్రాంత పరిసరాల మరియు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని తెలిపింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ మరియు వాయువ్య దిశల నుండి గాలులు…
ఆయనో మంత్రి. తనకు ఎదురులేకుండా అన్ని వ్యవహారాల్లో నెగ్గుకొస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం ఆయనపై పెద్దగా విమర్శలు చేయటంలేదు. ఆయనపై పోటీ చేసి ఓడిన జనసేన మాత్రం ఓ రేంజ్లో టార్గెట్ చేస్తోంది. కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ మంత్రిని ఇరుకున పెడుతోంది. దీంతో అమాత్యులవారు కౌంటర్ అటాక్‌కు సిద్ధమయ్యారట. వారెవరో ఈ స్టోరీలో చూద్దాం.! మంత్రిపై మొదటి నుంచి ఫిర్యాదులు చేస్తున్న జనసేన నేత మహేష్ వెలంపల్లి శ్రీనివాసరావు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి. బెజవాడ పశ్చిమ నియోజకవర్గం…
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి నందుకు 1989 మంది పై ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి అని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ఇక మాస్కులు లేకుండా బయట తిరిగే 4,400 మందిపై వంద రూపాయిలు చొప్పున ఫైన్లు వేసాము. అలాగే 27 మార్చ్ నుండి 5 మే వరకు 15,000 మందిపై రూ.5వందల రూపాయలు చొప్పున ఫైన్ వేసాము. మే5 నుండి ఇప్పటి వరకు 70వేల మంది పై ఫైన్ లు వేసాము…
పార్టీలో ఎవరు చేరాలనుకున్నా అన్ కండీషనల్ గా రావాల్సిందే అని మంత్రి కొడాలి నాని అన్నారు. కనకదుర్గమ్మ, శ్రీశైలం గుళ్ళల్లో క్షుద్రపూజలు చేసిన వ్యక్తి చంద్రబాబు. వైఎస్ రాజశేఖరరెడ్డి అనే మహా వృక్షంలో చిన్న చిగురు జగన్. ఆ చిగురు ఇవాళ మహా వృక్షమయ్యింది. జగన్మోహన్ రెడ్డి పై చంద్రబాబు, ఆయన తాబేదారులు, కొన్ని మీడియా సంస్థలు విషం కక్కుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోం. కొంత మంది రాజశేఖర్ రెడ్డిని…
అది ఏటా వందకోట్ల ఆదాయం వచ్చే ఆలయం. ఎవరు గుర్తించరని అనుకున్నారో.. ఇంతకంటే మంచి తరుణం రాదని భావించారో.. చేతివాటం ప్రదర్శిస్తున్నారట. కమీషన్లు పెంచి ముడుపులు దండుకున్నారట. నిధులు దారి మళ్లించడంలోనూ వారి తర్వాతేనని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దాతలు ఇచ్చే దాంట్లో ఎవరిది చేతివాటం? భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అన్నవరం సత్యనారాయణ స్వామి. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయ పాలకమండలి ఛైర్మన్ రోహిత్. ఈవో త్రినాథ్. దేవుడికి వచ్చే ప్రతి…
చిన్న కార్యకర్తకు కష్టమొచ్చినా.. నేనున్నంటూ వాలిపోతారు ఆ జిల్లాలోని టీడీపీ నేతలు. అరెస్ట్‌లు చేస్తే అక్రమమని అండగా నిలుస్తారు. అలాంటిది పార్టీలో ముఖ్యమైన నాయకుడి కుటుంబానికి ఇబ్బందొస్తే సొంతవారితోపాటు పార్టీవాళ్లెవరూ కిమ్మనలేదు. టీడీపీలో ఎవరా ముఖ్యనేత? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? 2019 తర్వాత రాజకీయంగా ఎదురు దెబ్బలు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది కింజరాపు ఎర్రన్నాయుడు కుటుంబం.జిల్లాతోపాటు టెక్కలిలోనూ వారి ఆధిపత్యం నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఏపీ టీడీపీ…
కడప జిల్లా : ఎట్టకేలకు బ్రహ్మంగారి పీఠాధిపతి వివాదం ముగిసింది. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి నియామకం అయ్యారు. దీంతో బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా వెంకటాద్రి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు కుటుంబ సభ్యులంతా రాతపూర్వకంగా కూడా హామీ ఇచ్చారు. పీఠం చిక్కుముడి వీడటంతో బ్రహ్మంగారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. read also : హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం.. తెలంగాణలో మూడు రోజుల పాటు! పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి, ఉత్తరాధికారిగా…