ఆయన ఎమ్మెల్సీ అయ్యి పదిరోజులు కూడా కాలేదు. అప్పుడే ఇబ్బందులు మొదలయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు అదేపనిగా ఫోన్ చేసి బెదిరిస్తున్నారట. ఆ కాల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఇంతకీ ఎమ్మెల్సీని బెదిరిస్తున్నది ఎవరు? ఏమని వార్నింగ్ ఇస్తున్నారు? ఎమ్మెల్సీకి ఎవరిపై అనుమానాలు ఉన్నాయి? లెట్స్ వాచ్! ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ అవుదామని రాజకీయాల్లోకి వచ్చారు! ఏపీలో ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన నలుగురిలో ఆర్. రమేష్ యాదవ్‌ను ఎంపిక చేయడం పార్టీ వర్గాలను…
ఆ జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలను కేబినెట్ బెర్త్ ఊరిస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అప్పుడే ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారట. ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలంటే కీలకంగా మారే సమీకరణాలేంటి? ఇప్పటికే జిల్లా నుంచి మంత్రులుగా ఉన్నవారిని కదుపుతారా? ఇంతకీ ఏంటా జిల్లా? ఈసారి కేబినెట్లో చోటు కోసం నేతలు గట్టి ప్రయత్నాలు రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్లో మార్పులు చేర్పులు చేస్తామని మంత్రుల ప్రమాణ స్వీకారం సమయంలో చెప్పారు ఏపీ సీఎం జగన్.…
జులై 23, 2021 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్ టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఏపీ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న పి.వి సింధు, ఆర్. సాత్విక్ సాయిరాజ్, రజనీలకు విషెస్ చెప్పారు సీఎం వైఎస్ జగన్. ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చెక్ అందజేసిన సీఎం వైఎస్ జగన్… విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను పి.వి. సింధుకి అందజేశారు. రజనీ (ఉమెన్స్ హకీ) చిత్తూరు జిల్లా,…
బ్రహ్మంగారి మఠాధిపతి ఎంపికపై మళ్లీ వివాదం రాజుకుంటుంది. మఠాధిపతి ఎంపికపై హైకోర్టులో రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. తనపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఒప్పుకునే లాగా చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. మఠాధిపతిగా ఎంపికైన వెంకటాద్రి స్వామి నియామకాన్ని నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు అని సమాచారం. వీలునామా ప్రకారం కాకుండా స్థానిక ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ అధికారులు మఠాధిపతిని ప్రకటించారని మారుతి మహాలక్ష్మమ్మ పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతున్నది. ముఖ్యమంత్రి సీఎం జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో కీలక విషయాలపై చర్చించబోతున్నారు. తెలంగాణతో ఉన్న జలవివాదం గురించి ముఖ్యంగా చర్చించే అవకాశం ఉన్నది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకంపై కూడా చర్చించే అవకాశం ఉన్నది. ఏపీలో ప్రాజెక్టులు అక్రమంగా నిర్మిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎంతో కాలంగా రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం నడుస్తున్నది. …
కరోనా బాధితులను ఆదుకునేందుకు సాధన దీక్ష చేయడం ఒక చరిత్ర అని… సీఎం జగన్ బాధ్యతా రాహిత్యంతో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అన్నారు. కరోనా బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు టీడీపీ చేపట్టిన సాధన దీక్ష ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రికి ప్రతిపక్షాలు, ప్రజలు, పత్రికలు చెప్పినా పాటించడం ఆనవాయితీగా వస్తోందని… ఒకప్పుడు పేపర్లలో…
వైసీపీ ఎమ్మెల్యేలు నోరు జారుతున్నారా? వెనకా ముందు ఆలోచించకుండా నోటికి పని చెబుతున్నారా? ఓ ఎమ్మెల్యే కీలకమైన ఒక సామాజికవర్గాన్ని తాగుబోతులని కించపరిచారు. మరో ఎమ్మెల్యే ఏకంగా తమ నాయకుడు ప్రవేశపెట్టిన పథకాన్నే అపహాస్యం చేసి.. ప్రత్యర్థులకు బోల్డంత కంటెంట్ ఇచ్చారు. నేతల ఈ వ్యవహారం వైసీపీకి ఇబ్బందికరంగా మారిందా? కాపు సామాజికవర్గంపై అంబటి అనుచిత వ్యాఖ్యలు ఎంత తోస్తే అంత.. పద్ధతీ పాడు లేకుండా మాట్లాడేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. కావడానికి సీనియర్ నాయకులే అయినప్పటికీ పార్టీని..…
తిరుమల శ్రీవారిని ఉచితంగా దర్శించుకునే భాగ్యం సామాన్య భక్తులకు తిరిగి ఎప్పుడు లభిస్తుంది? సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తామనే టీటీడీ.. ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదు? కరోనా తీవ్రతవల్ల నిలిచిపోయిన సర్వదర్శనం తిరిగి ప్రారంభించేది ఎప్పుడు? 300ల నుంచి వీఐపీల వరకు టికెట్లు పెట్టి దర్శనం చేయిస్తున్న టీటీడీకి ఉచిత దర్శనం ఎందుకు పట్టడం లేదు? ఆదాయంపై ఉన్న ధ్యాస సామాన్య భక్తులపై లేదా? సామాన్య భక్తులు క్యూ లైన్లో వేచి ఉంటే ఆహార పానీయాలు…
కొత్త ఎమ్మెల్సీల ఎంపిక తర్వాత ఆ నియోజకవర్గ వైసీపీలో వర్గపోరుకు మరోసారి తెరలేచింది. ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు నేతలు కీలక పదవుల్లో ఉండటంతో రాజకీయం మూడుముక్కలాటలా మారిందా?. వారసులను రంగంలోకి దించేలా ఒకే బరిపై ముగ్గురు గురిపెట్టారా?. వారేవరో ఈ స్టోరీలో చూద్దాం. ముగ్గురు నేతలు మూడు కీలకపదవుల్లో ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంత్రిగా ఉన్నారు. ఇదే ప్రాంతానికి చెందిన మరో…
తూర్పుగోదావరి కోరుకొండ మండలం వద్ద బావిలో పడి ముగ్గురు మైనర్లు గల్లంతయ్యారు. నిన్న మధ్యాహ్నం బైక్ అదుపుతప్పి పాడుబడిన వ్యవసాయ బావిలో పడిపోయారు వీర్రాజు (17), సునీల్ (17), శిరీష (13). 50 అడుగుల లోతున్న బావిలో గల్లంతైన వారికోసం నిన్న సాయంత్రం నుంచి గాలిస్తున్నారు పోలీస్ , ఫైర్ సిబ్బంది. స్థానికులు బావిలోకి దిగి చూసినా గల్లంతైన వారి ఆచూకీ లభ్యంకాలేదు. ఆ పాడుబడిన బావిలోని ఊబిలో కూరుకుపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బావిలో…