హైదరాబాద్ ఏవిధంగా అభివృద్ధి జరిగిందో.. ఇంకా కొత్త తరహాలో అమరావతిని అభివృద్ధి చేస్తాం అని సీఎం చంద్రబాబు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో అనేక రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఆధునిక సాంకేతికతకు చిరునామాగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. దేశ పురోగతిలో ఐటీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. టెక్నాలజీ మన జీవితంలో భాగంగా మారుతుందన్నారు. ‘వికసిత్ భారత్’ అనేది ప్రధాని మోడీ లక్ష్యం అని, అలాగే ‘స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్’ అనేది మన లక్ష్యం అని సీఎం పేర్కొన్నారు. విజయవాడలో…
ఉమ్మడి కడప జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం నేడు వైసీపీలో చేరనున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో సుగవాసి వైసీపీలో చేరనున్నారు. మాజీ టీడీపీ నేత బాలసుబ్రమణ్యం ఇప్పటికే రాయచోటి నుండి విజయవాడకు బయల్దేరారు. ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నరకు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో బాలసుబ్రమణ్యం జగన్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకోనున్నారు. రాయచోటి నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న సుబ్రహ్మణ్యం రాకతో.. వైసీపీకి…
కేంద్ర వాతావరణ శాఖ దేశ ప్రజలకు తీపి కబురు చెప్పింది. రేపటి నుంచి ఈనెల 30 వరకు దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు ప్రవేశించాయి. కానీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో అన్నదాతలు నిరాశ చెందారు.
అనంతపురం జిల్లాలో మరో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. అనంతపురం నగర శివారు బళ్లారి రోడ్డు సమీపంలో శివానంద అనే యువకుడు నిన్న దారుణహత్యకు గురయ్యాడు. నేడు అనంతపురం రూరల్ అక్కంపల్లి గ్రామ సమీపంలో కుమ్మరి సురేష్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో తలపై మోది హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. Also Read: Outsourcing Staff: ఉద్యోగుల నియామకాలపై మంత్రుల బృందం ఆరా.. వారంలో మరోసారి…
ఆప్కాస్ వ్యవస్థపై పూర్తి యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామక వ్యవస్థపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది. విద్యాశాఖ చాంబర్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, విద్య-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, పురపాలక శాఖ మంత్రి నారాయణతో కూడిన మంత్రుల బృందం అధికారులతో మొదటిసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆప్కాస్ వ్యవస్థ గురించి సమగ్ర సమాచారాన్ని అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. Also Read:…
ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో వైఎస్ జగన్ సమావేశం.. హాజరుకానున్న వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తలు, పార్టీ పార్లమెంటరీ పరిశీలకులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, ముఖ్యనేతలు నేడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తి’ కార్యక్రమం.. సాయత్రం 5 గంటలకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు నేడు ఏలూరులో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన.. ఎమర్జెన్సీ డే విధించి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా ఏర్పాటు…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 19న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నా.. మిర్చి యార్డులో పర్యటించారని కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్‌తో పాటు వైసీపీ నేతలు అంబటి రాంబాబు, కావటి మనోహర్ నాయుడు, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై కేసు నమోదైంది. Also Read: Pawan Kalyan: పోటీ…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తమిళనాడు మంత్రి శేఖర్ బాబు సవాల్ విసిరారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా? అని పవన్‌ను ప్రశ్నించారు. చెన్నైలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయొచ్చని, తమిళనాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచి చూపించాలని ఛాలెంజ్ విసిరారు. ఒకవేళ తమిళనాడు ఎన్నికల్లో పవన్ గెలిస్తే.. ఎన్ని చెప్పినా వినడానికి తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి శేఖర్ బాబు తెలిపారు. జనసేనాని తాజాగా…
విజయవాడ కనక దుర్గమ్మ గుడి మాస్టర్ ప్లాన్ రెడీ చేయడం జరిగిందని, వచ్చే 40 సంవత్సరాల అవసరాలకు తగ్గట్టు దుర్గగుడి అభివృద్ధి పనులు చేపడుతాం అని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. కృష్ణా పుష్కరాల నిర్వహణకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నామని చెప్పారు. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో 70 శాతం పనులు పూర్తయ్యేలా చేశాం అని.. రాబోవు రోజుల్లో వారణాసి, అలహాబాద్‌కి ఫ్లైట్ కనెక్టివిటీ చేస్తున్నాం అని పేర్కొన్నారు. విజయవాడకు అతిముఖ్యమైన రైల్వే లైన్స్‌కి 1500 కోట్లతో టెండర్లను…
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం కొండమదులు పంచాయతీలోని గ్రామాలలోని పోలవరం నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏజెన్సీ గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. రెండోవ రోజు రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమతో 2017 సంవత్సరంలో కుదుర్చుకొన్న ఎంఓయు ప్రకారం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. Also Read: AP Cabinet: కేబినెట్ సమావేశం నుంచి వెళ్లిపోయిన డిప్యూటీ…