ఈ ఏడాది ముందుగాను రుతుపవనాలు పలకరించడంతో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. ఏపీ, తెలంగాణలో వానలు దంచికొట్టాయి. కాగా కొద్ది రోజులుగా వానలు ముఖం చాటేయడంతో అన్నదాతలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. కప్పతల్లి ఆటలాడుతూ వరుణ దేవుడిని కరుణించమని వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. Also Read:Mollywood : డ్రగ్స్ దుమారంపై.. మలయాళ పరిశ్రమ…
వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏవేవో మాట్లాడిన పిఠాపురం పీఠాధిపతి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కనబడటం లేదని విమర్శించారు. శ్రీ సత్యసాయిలో ఈరోజు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ‘డిప్యూటీ సీఎం’ పవన్ కళ్యాణ్ ఎక్కడైనా కనిపించారా? అంటూ శ్యామల ప్లకార్డ్ ప్రదర్శించారు. పవన్ గురించి శ్యామల చేసిన కామెంట్స్ ఇప్పుడు…
పీఎస్ఆర్టీసీకి కొత్త తలనొప్పి వచ్చి పడింది. సిబ్బంది నియామకం కంటే ముందే.. వందల సంఖ్యలో రిటైర్మెంట్లు పెద్ద సమస్యగా మారింది. పాత బస్సులకు రంగులేసి సిద్ధం చేసుకోవడంలో తలమునకలైన ఏపీఎస్ఆర్టీసీకి సిబ్బంది కొరత భారీగా ఎదరవనుంది. ఏపీఎస్ఆర్టీసీలో జూన్, జులై నెలల్లో పదవీ విరమణకు సుమారు 900 మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. కొత్త సిబ్బందిపై అధికారులు సమావేశం కానున్నారని తెలుస్తోంది. Also Read: Pawan Kalyan: సినిమా డైలాగులు హాలు వరకే బాగుంటాయి.. వైఎస్ జగన్‌కు…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలు, ఆయన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. చట్టాన్ని ఉల్లంఘించే విధంగా మాట్లాడే నేతలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సినిమాల్లో చెప్పే డైలాగులు సినిమా హాళ్ల వరకే బాగుంటాయని, ఆ డైలాగులను ప్రజాస్వామ్యంలో ఆచరణలో పెట్టడం సాధ్యపడదన్నారు. ఎవరు అయినా సరే చట్టాన్ని, నియమ నిబంధనలను గౌరవించాల్సిందే అని తెలిపారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అని హెచ్చరించారు.…
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025లో భాగంగా మరో గిన్నిస్ రికార్డు కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. విశాఖలో 26,395 మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సూర్య నమస్కార కార్యక్రమం ఉండబోతుంది. రేపు వాతావరణం అనుకూలించక వర్షం పడితే.. ఆర్కే బీచ్ రోడ్డులో కార్యక్రమాలు రద్దు చేసి మొత్తం కార్యక్రమం ఇదే వేదిక వద్ద నిర్వహించే అవకాశం ఉంది. వాతావరణం…
ఏవోబీ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు అగ్రనేత అరుణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్వస్థలం పెందుర్తి మండలం కరకవానీ పాలెంలో బంధు మిత్రులు, ప్రజాసంఘాలు అంతిమ వీడ్కోలు పలికాయి. అంతిమ యాత్రలో ‘కామ్రేడ్ అరుణ అమర్ ర హే’ నినాదాలు హోరెత్తాయి. కగార్ పేరుతో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ప్రజా సంఘాలు ఆరోపించాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో అరుణ మరణించిన విషయం తెలిసిందే. ఏవోబీ ఈస్ట్ డివిజన్ సెక్రటరీగా…
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయ హుండీలో ఓ ఖరీదైన వజ్రం లభించింది. దేవాదాయ శాఖ ఆధికారులు గురువారం హుండీ లెక్కింపును చేపట్టగా.. అందులో వజ్రాన్ని గుర్తించారు. ఆ వజ్రం 1.39.6 క్యారెట్లు ఉన్నట్లు ఆధికారులు తేల్చారు. ఓ అజ్ఞాత భక్తుడు వజ్రంను ఆంజనేయ స్వామి ఆలయ హుండీలో వేసినట్లు దేవాదాయ శాఖ ఆధికారులు తెలిపారు. తమకు హుండీలో వజ్రం, టెస్టింగ్ కార్డుతో పాటు ఓ లేఖ కూడా దొరికిందని చెప్పారు. ‘నాకు వజ్రం…
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ సాగరతీరం ముస్తాబయింది. యోగాంధ్ర 2025 కోసం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిమీ మేర వేదికలు సిద్ధం చేశారు. అన్ని వేదికలలో మ్యాట్లు, విద్యుద్దీపాలు, ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. రికార్డు స్థాయిలో ఒకేచోట 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా ఏర్పాట్లు చేశారు. ఒకవేళ వర్షం పడితే.. కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ఆంధ్ర వర్సిటీలో ప్రత్యామ్నాయ వేదిక కూడా సిద్ధంగా ఉంది. జూన్ 21న…
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేడు విశాఖకు రానున్నారు. ప్రధాని శుక్రవారం సాయంత్రం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. సాయంత్రం 6.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్‌కు వెళతారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీలు ప్రధానికి స్వాగతం పలకనున్నారు. రాత్రికి తూర్పు నౌకాదళం గెస్ట్ హౌస్‌లోనే బస చేస్తారు. శనివారం ఉదయం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో నవ్వులు పూయించారు. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాలోని ‘గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం’ అనే డైలాగ్ చెప్పి రిపోర్టులను కాసేపు నవ్వించారు. పుష్ప సినిమాలో డైలాగ్ పెట్టినా తప్పేనా?.. పుష్ప మాదిరి గడ్డం అన్నా తప్పే.. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా?, లేదా? అని జగన్ ప్రశ్నించారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైఎస్ జగన్…