ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ముందుకు వెళుతుంటారు వాహనదారులు. ఇక లారీలు, పెద్ద వాహనాలైతే చెప్పాల్సిన పనిలేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు లాఠీలకు పనిచెబుతుంటారు. జరిమానాలతో బుద్ధి చెబుతారు. కానీ కొంతమంది ట్రాఫిక్ పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. తిరుపతి అన్నమయ్య సర్కిల్ లో ఓ వ్యక్తిని ట్రాఫిక్ కానిస్టేబుల్ కాలితో తంతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఆ వ్యక్తి ఏం తప్పుచేశాడో, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎందుకు కొడుతున్నాడో ఎవరికీ అర్థం కావడంలేదు. సామాన్యుడిపై అలా నడిరోడ్డు మీద కాలితో తన్నడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. ఆ వ్యక్తి ట్రాఫిక్ పోలీస్ తో ఏదో మాట్లాడడం, వెంటనే పోలీస్ అతడిని ఎగిరెగిరి తన్నడం వీడియోలో కనిపిస్తోంది. అక్కడినించి వెళ్ళిపోతున్నా.. పోలీస్ మాత్రం వదలలేదు. ఈ దృశ్యాలను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఉన్నతాధికారులు ఈ ఫ్రెండ్లీ పోలీస్ భరతం పడతారా… మేమింతే అని అతడిని వదిలిపెడతారో చూడాలి. సామాన్యుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని ఐపీఎస్ స్థాయి అధికారులు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా.. కొంతమంది ట్రాఫిక్ పోలీసులు ఇలా వ్యవహరించడం మామూలైపోయింది. డీజీపీ గారూ.. జర చూడండి సార్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Salaar: టీజర్‌కి ముహూర్తం ఖరారు.. వచ్చేది అప్పుడే!