R. Krishnaiah: చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఛలో ఢిల్లీ కార్యక్రమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ‘ ఛలో ఢిల్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చట్ట సభలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. దీని సాధన కోసం ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
పార్లమెంట్ లో బీసీల న్యాయపరమైన డిమాండ్ల కోసం కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ కాచిగూడలో నిర్వహించిన బీసీల సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. బీసీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల కన్నా తెలుగు రాష్ట్రాల్లోనే ఉద్యమాల ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉచిత విద్యను అభ్యసిస్తున్నారు అని అన్నారు. దేశంలో 70 కోట్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని.. చట్ట సభల్లో తమకు వాటా దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
- Bhatti Vikramarka : నేలను కాదు.. బుద్ధిని శుద్ధి చేసుకోండి’
- TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
- Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్.. పొటెన్సీ టెస్ట్‌పై కీలక ఆదేశాలు.!
పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లు 34 నుండి 50 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై క్రిమిలేయర్ ఎత్తివేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన వ్యక్తి అయినా.. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. రాజ్యసభ ఎంపీగా ఆయన ఇటీవల ఎన్నికయ్యారు.
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
-
CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!