AP Weather Alert: ఏపీకి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. తిరుపతి, కడప, నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. జనాలకు కీలక సూచనలు చేస్తున్నారు.
AP weather Update Today: కరువు భయం కమ్ముకున్న వేళ ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్ న్యూస్. గురు, శుక్రవారాల్లో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాదు రాష్ట్రంకు వారం రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్ద కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని విశాఖ వాతావరణ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఏపీలోని కొన్ని జిల్లాలో వాతావరణం చల్లబడింది. అక్కడక్కడా చిరు జల్లులు పడుతున్నాయి. Also…
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి.. మరో వైపు వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. అయితే, రేపు, ఎల్లుండి, ఆ తర్వాత రోజు.. మూడు రోజుల పాటు రాష్ట్రంలో భిన్నవాతావరణం ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది.. మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత పెరగనుండగా.. మరోవైపు.. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.. ఈ సమయంలో పిడుగులు పడతాయని వార్నింగ్ ఇచ్చింది వాతావరణశాఖ..
"దానా" తీవ్ర తుఫాన్ తీరం దాటింది.. అర్ధరాత్రి 1.30 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 గంటల మధ్య.. హబాలిఖాతి నేచర్ క్యాంప్(భిత్తర్కనిక) మరియు ధమ్రాకు సమీపంలో తీరం దాటేసింది తుఫాన్ దానా.. ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ మరో 2-3 గంటల పాటు కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఈ రోజు మధ్యాహ్నం నుంచి క్రమంగా బలహీనపడుతుందని అధికారులు చెబుతున్నారు.. ఇదే సమయంలో.. ఉత్తరాంధ్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ.
ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి వ్యాపించి ఉండగా.. 21వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రం, పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని పేర్కొంది.. ఇది వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని.. ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 23 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది ఐఎండీ.
Weather Update: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీగా మరో ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అది క్రమంగా బలపడి ఉత్తరాంధ్ర వైపు పయనించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం.. గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తూర్పు, ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు…
AP and Telangana Weather Forecast: ఏపీ, యానాంలో నైరుతి దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం (జూన్ 26) బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఈ అల్పపీడనం బలపడుతూ.. ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. అదే రోజున అల్పపీడనం ఏపీ తీరాన్ని తాకనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో బుధవారం సాయంత్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురవన్నాయి. అల్పపీడనం ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా…