నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుపాన్ ఏర్పడింది. ప్రస్తుతానికి ఇది ట్రింకోమలీ (శ్రీలంక)కి 80 కి.మీ, పుదుచ్చేరికి 480 కి.మీ, చెన్నైకి 580 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 8 కి.మీ వేగంతో తుపాన్ కదిలింది. ఎల్లుండికి నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. దిత్వా తుపాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు…
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రానున్న మూడు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అంతేకాదు పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్ల క్రింద ఉండకూడని, ఇంట్లోనే సురక్షితంగా ఉండండని ప్రజలకు సూచించారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ…
ఏపీలో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశముంది. పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయని వాతావరణ అధికారులు చెప్పారు. విజయనగరం, మన్యం, ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే? తూర్పుగోదావరి, ప్రకాశం, వైఎస్సార్, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు కురుస్తాయని వాతావరణ శాఖ…