బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారంకు తుపానుగా బలపడనుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, ఈడీ దీపక్, అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. అల్పపీడనం నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సోమవారంకు తుపానుగా బలపడుతుందని ఎండీ ప్రఖర్ జైన్ చెప్పారు. రాష్ట్రానికి రేపు భారీ, ఎల్లుండి అతిభారీ, సోమ-మంగళ వారాల్లో అత్యంత భారీ వర్ష సూచన ఉందని తెలిపారు. తుపాను తీవ్రతను అంచనా వేసి ప్రభావిత జిల్లాలని అలెర్ట్ చేయాలని…
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రానున్న మూడు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అంతేకాదు పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్ల క్రింద ఉండకూడని, ఇంట్లోనే సురక్షితంగా ఉండండని ప్రజలకు సూచించారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ…