రాష్ట్రంలో మూడు రాజధానులు వచ్చి తీరతాయన్నారు మంత్రి ఆర్ కె రోజా. విశాఖపట్నంలో ఆమె పర్యటించారు. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా టీడీపీ నేతలపై మండిపడ్డారు. చంద్రబాబునాయుడు, బాలకృష్ణపై విమర్శలు చేశారు. ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పుపై శనివారం బాలయ్య చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతున్న వేళ మంత్రి రోజా నందమూరి బాలకృష్ణ కు కౌంటరిచ్చారు. ఎమ్మెల్యే బాలకృష్ణ వై.సి.పి.నాయకులను కుక్కల్లా మొరుగుతారు అనడం…. దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి.
మీ తండ్రి మరణానికి కారకుడైన చంద్రబాబుపై పగతీర్చుకో…రైతుల పేరుతో దొంగ పాదయాత్రలు చంద్రబాబు చేయిస్తున్నారు…తన సామాజిక వర్గానికి,తన రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుపడాలనే..ఆనాడు తాత్కాలిక రాజధాని పేరుతో అమరావతిలో భూములు కొని వ్యాపారం చేశారు…ఇప్పటికి కొంతమంది రైతులను మోసం చేస్తూ..వారిని ఉసిగొల్పుతూ..మూడు రాజధానులును అడ్డుకోవాలని చూస్తున్నారు
Read Also: Bigg boss 6: మూడోవారం ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే
ఆరు నూరయినా విశాఖ ను పరిపాలన రాజధానిని చేసి తీరుతాం అని స్పష్టం చేశారు మంత్రి రోజా. అమరావతిలో మాత్రమే రైతులు ఉన్నారా?రాయలసీమ,ఉత్తరాంధ్రలో లేరా రైతులు అని ఆమె ప్రశ్నించారు. ఎన్. టి.ఆర్ పేరు హెల్త్ యూనివర్సిటీకి మార్చడంపై చంద్రబాబు కుటుంబం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన విషయం మరిచిపోయారా అని ఆమె అన్నారు. అమరావతి టు అరసవిల్లి కి ప్రారంభమయిన మహా పాదయాత్ర కొనసాగుతూనే వుంది. ఇవాళ 14వ రోజుకు చేరుకుంది అమరావతి రైతుల మహా పాదయాత్ర. ఇవాళ నాగవరప్పాడు నుంచి బయలుదేరింది పాదయాత్ర.
Read Also: Tammineni Sitaram: క్యాన్సర్ పై మరింత అవగాహన అవసరం