ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గుంటూరులో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాశాంతి పార్టీ గుంటూరు జిల్లా కమిటీ ఏర్పాటు చేశామని.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది ఆన్లైన్లో ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తోందని కేఏ పాల్ ఆరోపించారు.
రాయల తెలంగాణ అంశంపై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ నాయకత్వంతోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాకారమని.. రాయల తెలంగాణ అంశం వదిలి ఆ దిశగా ఆంధ్ర ప్రజలు ఆలోచించాలని కోరారు.