టీడీపీ అధినేత చంద్రబాబు గుడివాడ పర్యటనపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు, గుడివాడ వచ్చి కొత్తగా ఏం చెప్తాడని ఆయన అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీకి చెందిన నేతలు వరుసగా ఢిల్లీలో మంతనాలు జరపడం ఆసక్తి రేపుతోంది. మొన్న పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసారు.
ఎంతసేపు సీఎం జగన్ పై నిందలు, విమర్శలు చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్రలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా జరిగిందా అంటూ ఆయన ప్రశ్నించారు. ఎవరి పనైపోయిందో వచ్చే ఎన్నికలే చెబుతాయన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం పెద్ద దళితవాడ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నుంచి సస్పెండైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నగరంలోని మాగుంట లేఔట్లోని నివాసం నుంచి బయటకు వెళ్లకుండా ఆయన్ను అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో తన ఇంటి వద్దే కోటంరెడ్డి బైఠాయించి నిరసన తెలిపారు.