రాష్ట్రంలో జరుగుతున్న దాష్టికాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పని చేస్తామని జనసేన పీఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రానికి మేలు జరిగే విధంగా పొత్తులు ఉంటాయన్నారు.
టీడీపీ, జనసేనలతో పొత్తుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తులోనే ఉన్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. టీడీపీని కలుపుకోవాలనే ప్రతిపాదనను పవన్‌కల్యాణ్‌ను తీసుకువచ్చారని.. అదే విషయాన్ని పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్లామన్నారు.
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరబోతున్నాడనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాను రాజకీయాలలోకి రావాలనుకుంటున్నట్లు అంబటి రాయుడు ఇంతకు ముందే ప్రకటించాడు. ఇదిలా ఉండగా.. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. టీడీపీ వల్ల దళారులు బాగుపడ్డారని.. వైసీపీ ప్రభుత్వం రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
రాజధాని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్న టీడీపీ నేతలకు హైకోర్టు తీర్పు చెంప చెళ్లుమనిపించిందని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తీవ్రమైన వ్యాఖ్యలతో మండిపడ్డారు. రైతుకు వ్యవసాయం దండగ అన్న నీచుడు చంద్రబాబు అంటూ సీరియస్ అయ్యారు.