స్వంత పార్టీకి చెందిన నేతపైనే అదే పార్టీకి చెందిన మహిళా నేత పంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం వైసీపీ నాయకురాలు జక్కా లీలావతి ప్రెస్ మీట్ పెట్టారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ వల్ల తమకు ప్రాణహాని ఉందన్నారు లీలావతి. నా భర్త కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం పడతడిక సర్పంచ్ ప్రదీప్ కుమార్. గతంలో నాపై ,నా భర్తపై కేసులు పెట్టి వేధించారు. నా భర్తకు ఎమ్మెల్యే జోగిరమేష్ కొంతమంది వ్యక్తులు చేత…
ఏపీలో సంచలనం కలిగిస్తోంది స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాు.ఈ స్కాంలో సీఐడీ విచారణ లోతుగా కొనసాగిస్తోంది. రూ.242 కోట్ల అక్రమాలపై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులు అనేక అంశాలపై ఫోకస్ పెట్టారు. ఇందు కోసం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, పూణే, ఢిల్లీ, ముంబైలలో సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఢిల్లీ, పూణేలోని షెల్ కంపెనీల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. డిజైన్ టెక్ కి తాము ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వలేదని పూణే సంస్థలు స్పష్టం చేశాయని…
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, సౌమ్యుడు రోశయ్య మరణం తీరని లోటు అని రాజకీయ నేతలు నివాళులర్పించారు. రోశయ్య అందరికీ సూపరిచితులు…ఆయన మరణం బాధ కలిగించింది. ఆయన లేకపోవడం రాజకీయాల్లో తీరని లోటు అన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి. రాజకీయాల్లో ఆయన ఎన్నో పదవులు అనుభవించారు. ఎవరికీ ఇబ్బంది కలిగించే వ్యక్తి కాదు, శాంతమూర్తి. ఎన్నో చరిత్రలు రోశయ్య సొంతం అన్నారు జగ్గారెడ్డి. ఆయనో స్వాతంత్ర్య సమరయోధుడు. నేను అందరికీ…
మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబునాయుడిపై మరోమారు ఫైర్ అయ్యారు మంత్రి కొడాలి నాని. లోకేష్ సహా పలువురు టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నాగురించి వంశీ, జగన్ కుటుంబ సభ్యులపై టీడీపీ ఆఫీసు నుండి లోకేష్ చేసి పోస్టింగ్ ల పై వాళ్ళను ఏం చేయాలి? వంశీ చేసిన వ్యాఖ్యలు తన సొంతానివి కావు. సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలవి. రాజకీయాల కోసం పెళ్ళాన్ని కూడా వాడుకుంటారా? చంద్రబాబు మహా నటుడు. చంద్రబాబు లాంటి…
ఏపీ రాజకీయాల్లో కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినపడుతోంది. ఇటీవల చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు తీవ్రంగా ఆరోపించగా… నందమూరి కుటుంబసభ్యులు కూడా ఈ అంశంపై స్పందించారు. అయితే హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందన తమకు నచ్చలేదని కొందరు టీడీపీ సీనియర్ నేతలు బాహాటంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీఆర్ అభిమానులు నిరసన వ్యక్తం చేసిన విషయం సోషల్…
ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ కుప్పంలో ఆయన అభిమానులు ఫ్లెక్సీలు కట్టి సందడి చేశారు. దీంతో ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ సంఘం అధ్యక్షుడు శివ పీసీ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని, టీడీపీకే పనిచేస్తున్నామని కుప్పం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలిపారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతోనే సీఎం ఎన్టీఆర్ అనే…
ఏపీలో ఇటీవల నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 నగరపంచాయతీ, గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కొన్ని స్థానాల్లో వైసీపీ దూసుకుపోగా, మరొకొన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు సత్తాచాటారు. అయితే తాజాగా కొండపల్లి మున్సిపాలిటీకి చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొండపల్లి మున్సిపాలటీలో 29 స్థానాలు ఉండగా అందులో 14 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలువగా, మరో 14 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వీరితో…
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కీలక కామెంట్లు చేశారు. ఆంధ్రా రాజకీయం ప్రశాంతంగా జరిగేలా జగన్ చొరవ తీసుకోవాలి. పగలు..ప్రతీకారం వరకు వెళ్ళకండి. కొడాలి నాని మాటలు మార్చుకుంటే బెటర్. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినప్పుడు నాని ఎక్కడ ఉన్నాడు. కౌరవ సభలో ద్రౌపదికి జరిగిన అన్యాయమే బాబుకు జరిగిందన్నారు జగ్గారెడ్డి. టీడీపీ వాళ్ళు కూడా మీ కుటుంబాన్ని అంటే ఎలా ఉంటుంది? ఏపీతో నాక్కూడా…
ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని, నా భార్య శీలాన్ని కించపరిచేవిధంగా మాట్లాడుతున్నారంటూ సభలోంచి వెళ్లిపోయారు. అంతేకాకుండా మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడుతానంటూ శపథం చేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరుపెట్టుకున్నారు. అప్పటినుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనజ్వాలలు రగులుతున్నాయి. ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబ సభ్యులు బాలకృష్ణ నేతృత్వంలో…
2019 ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఏపీలో అధికార పార్టీ వైసీపీ దూకుడు మీద వుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏ ఎన్నికలు జరిగినా.. అక్కడ ఫ్యాన్ గాలి హవా కొనసాగుతూనే వుంది. తాజాగా సీఎం స్వంత జిల్లా కడపలోని బద్వేల్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 30న ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం. నవంబర్ 2వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. బద్వేల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేనలు పోటీలో లేవు. కానీ,…