1. కృష్ణా జిల్లా గుడివాడలో ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. మంత్రి కొడాలి నాని, టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, టీడీపీ నేత వంగవీటి రాధాలు ఒకేచోట కలుసుకున్నారు. గుడివాడలోని కొండాలమ్మ గుడి వీరి కలయికకు కారణమైంది. ఈ ముగ్గురూ కృష్ణా జిల్లాలో పేరున్న పొలిటికల్ లీడర్స్ కావడం విశేషం.
2. రైతు చట్టాలను మళ్లీ తీసుకు వస్తామని కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. రైతు చట్టాలపై కేంద్ర మంత్రి తోమర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని.. భేషరుతుగా దేశ రైతాంగానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
3. వైసీపీ మళ్ళీ అధికారం లోకి రావడం ఖాయమని.. ఈ విషయాన్ని ఎల్లో మీడియా గుర్తు పెట్టుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికల ఫలితాలు మార్చే పరిస్థితి ఉండదని చురకలు అంటించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశారని… గ్రామాల్లోకి వెళితే కేవలం ఇల్లు కోసం అర్జీలు, లేదా భూ వివాదాలపై మాత్రమే ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు.
4. తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ ఏడాది జరిమానాల రూపంలో ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది. తెలంగాణ వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ ఏడాదిలో ఇప్పటిరకు రూ.533కోట్ల జరిమనాను పోలీసులు విధించారు. అంటే రోజుకు రూ. కోటిన్నర చొప్పున వసూలు చేశారు.
5.కరోనా సెకండ్ వేవ్ ఈ యేడాది తెలుగు సినిమా రంగాన్ని కాస్తంత కల్లోల పర్చింది. అయితే దానికంటే ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుండి సరైన సహకారం లభించకపోవడం సినిమా రంగాన్ని ఇబ్బందులకు గురిచేసింది. తెలంగాణలో మరోసారి సినీ ప్రముఖులు డ్రగ్స్ కేసు విషయమై విచారణను ఎదుర్కొంటే, ఏపీలో ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ ప్రభుత్వ విధానాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. మొత్తం మీద ఈ యేడాది సినిమా రంగ ప్రయాణం ఏమంత సాఫీగా సాగలేదు.
6. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఎమ్మెల్యే లేకుండా ఎంపీ అరవింద్ ప్రారంభోత్సవం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ నేతలు. ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు టీఆర్‌ఎస్ కార్యకర్తలు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
7 హైదరాబాద్‌లోని శివశక్తి ఫౌండేషన్‌పై సినీ నటి కరాటే కళ్యాణి తీవ్ర ఆరోపణలు చేశారు. శివశక్తి ఫౌండేషన్ ఓ దుష్టశక్తి అని అభివర్ణించారు. అమాయక హిందువుల నుంచి ఈ ఫౌండేషన్ విరాళాలను సేకరిస్తోందని.. వాటిని సొంత అవసరాలకు మళ్లించారని ఆరోపించారు. శివశక్తి ఫౌండేషన్‌లో పాత సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి నిధులను దారి మళ్లించారన్నారు.
8.‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో హీరోగా అడుగుపెట్టాడు నవీన్ పోలిశెట్టి. ఈ చిత్రంతో టాలీవుడ్ లో సత్తా ఉన్న కుర్ర హీరో అనిపించుకున్న నవీన్ ఆ తరువాత జాతి రత్నాలు చిత్రంతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత నవీన్ పెద్ద బ్యానర్ లోనే పడ్డాడు. ఎప్పటినుంచో నవీన్ , అనుష్క శెట్టి జంటగా ఒక సినిమా రాబోతున్నదని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూ ఈ సినిమాను మేకర్స్ మొదలుపెట్టినట్లు తెలిపారు.
9 ఏపీలో సినిమా టికెట్ల రేట్ల వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా అయితే కనిపించడంలేదు. టిక్కెట్ల రేట్ల కారణంగా ఇప్పటికే వందల సంఖ్యలో థియేటర్లు మూతపడ్డాయి. సౌతిండియాలో అతిపెద్ద స్క్రీన్ కూడా మూతపడింది. ఈ ఇష్యూపై ఇటీవల హీరో నాని సంచలన కామెంట్స్ చేయగా తాజాగా హీరో నిఖిల్ స్పందించాడు. ఏపీలో థియేటర్లు మూతపడటం చాలా బాధాకరమన్నాడు.
10. మనదేశ కరెన్సీ విలువ రానురాను పడిపోతోంది. భారత రూపాయి ఈ ఏడాది ఆసియాలోనే అత్యంత పేలవమని కరెన్సీగా నమోదయిందంటే పరిస్థితి ఎలా వుందో అర్థంచేసుకోవచ్చు. ప్రస్తుత త్రైమాసికంలో రూపాయి విలువ 2.2 శాతం పైగానే క్షీణించింది. రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది. ఒమిక్రాన్ వైరస్ భయాలకు తోడు గ్లోబల్ మార్కెట్లలోనూ ప్రతికూలతలే ఇందుకు కారణం.