1 తెలంగాణలో మళ్ళీ ముందస్తు ఎన్నికలు రానున్నాయా? కేసీఆర్ గతంలోలాగే మళ్లీ ఎన్నికల నగారా మోగించనున్నారా? 2023లో రావాల్సిన ఎన్నికలు 2022లో ఎప్పుడైనా వస్తాయా? అవుననే అనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు. సిద్ధంగా ఉండండి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు. రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.
అమిత్ షా నోట ముందస్తు ఎన్నికల మాట
2 ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలు వెబ్‌సైట్‌లో ఎందుకు అప్‌లోడ్ చేయడం లేదని కోర్టు ప్రశ్నించింది. జీవోల్లో ఐదు శాతమే సైట్‌లో ఉంచుతున్నారని న్యాయవాది బాలాజీ తెలిపారు. కాగా ఇది సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకమని ఆయన కోర్టుకు తెలిపారు.
ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం
3 వీధి రౌడీల్లా అశోక్ గజపతిరాజుపై మంత్రులు దాడికి తెగించారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. మంత్రుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా.. రామతీర్థం రాముని సాక్షిగా వైసీపీ అరాచకం బట్టబయలైందన్నారు.దేవాలయాల్లో పాటించాల్సిన ఆనవాయితీని ప్రశ్నిస్తే దాడులు చేసే సంస్కృతికి వైసీపీ ప్రభుత్వం దిగజారిందని ఆరోపించారు చంద్రబాబు.
మంత్రులపై చంద్రబాబు ఫైర్.. వీధి రౌడీల్లా అశోక్ గజపతిపై దాడికి తెగించారు..!
4 కడప జిల్లాలో ఏపీ సీఎం జగన్ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. 23 వ తేదీన అంటే రేపు ఉదయం 11 గంటల సమయంలో… గన్నవరం నుంచి ప్రొద్దుటూరు వెళ్లనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి… ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన
5 డీజిల్ పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వాహనాలను బయటకు తీసుకొచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. మామూలు వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల ఖరీదు అధికం. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారిక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేస్తే… పన్ను మినహాయింపు…
6 ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ప్రకంపనలు టీఆర్ఎస్ వర్గాల్లో కొనసాగుతున్నాయి. ఎవరికి వారుగా పోస్టుమార్టం చేస్తున్నారు. అందరి ఫోకస్ కొత్తగూడెం, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాలపై ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే క్రాస్ ఓటింగ్ జరిగిందా లేక.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై ఎమ్మెల్యేలకు పట్టు సడలిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఖమ్మం టీఆర్ఎస్‌లో క్రాస్ ఓటింగ్ ప్రకంపనలు..!
7 మయన్మార్‌లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఉత్తర మయన్మార్‌లోని కచిన్ రాష్ట్రంలోని జాడే గనుల్లో కార్మికులు పనిచేస్తుండా హటాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో 70 మంది కార్మికులు గల్లంతయ్యారు. ఒకరు మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు.
మయన్మార్‌లో దారుణం… విరిగిపడ్డ కొండచరియలు…
8 ఒమిక్రాన్ వేరియంట్‌లో హెచ్ఐవీ మూలాలు ఉండే అవకాశం ఉందని, ఆ దిశగా పరిశోధనలు చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హెచ్ఐవీ సోకిన వారికి కరోనా సోకడం, ఆ తరువాత కరోనా వైరస్‌లో ఉత్పరివర్తనాలు జరిగి ఒమిక్రాన్ వేరియంట్ పుట్టుకు వచ్చి ఉండవచ్చిన పరిశోధకులు చెబుతున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్‌లో హెచ్ఐవీ లక్షణాలు…?
9 పరభాషా నాయికల కోసం టాలీవుడ్ డోర్స్ ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. ఈ మధ్యలో కన్నడ భామలు అత్యధికంగా తెలుగు చిత్రసీమలోకి వచ్చారు. అయితే ఆ జోరు ఇప్పుడు కాస్తంత తగ్గింది. కానీ చిత్రంగా ఈ యేడాది శాండిల్ వుడ్ బ్యూటీ కృతీశెట్టి అత్యధిక అవకాశాలు అందుకుని, నయా హీరోయిన్స్ జాబితాలో టాప్ ప్లేస్ దక్కించుకుంది.
2021 అందాల భామల టాలీవుడ్ అరంగేట్రమ్!
10 ముంబైలో ‘ఆర్ఆర్ఆర్’ త్రయం హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 7 న ‘ట్రిపుల్ ఆర్’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రామ్ చరణ్, తారక్, రాజమౌళి ముంబైలో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
‘ఆర్ఆర్ఆర్’ త్రయంతో భల్లాలదేవా.. త్వరలోనే మరో రచ్చ