1.ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ రేట్ల విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సంక్రాంతి సీజన్ లో విడుదల కావాల్సిన పాన్ ఇండియా చిత్రాల విడుదల వాయిదా పడటంతో ప్రభుత్వం కూడా ఈ విషయమై నింపాదిగానే నిర్ణయం తీసుకొనేలా కనిపిస్తోంది. పలువురు ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు దర్శక నిర్మాతలు ఆర్. నారాయణమూర్తి, రామ్ గోపాల్ వర్మ వంటి వారు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖామంత్రి పేర్ని నానిని వ్యక్తిగతంగా కలిసి తమ వాదన వినిపించారు. READ ALSO…
రిపబ్లిక్ డే రోజు జాయ్ పార్క్‌లో జాతీయ పతాకం ఎగురవేయవద్దని అధికారులను బెదిరించడం సరికాదని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేము నిర్మించి జాయ్ పార్క్‌కు రిజిస్ట్రేషన్ ఉంది మీరు నిర్మిస్తున్న పార్క్‌కు రిజిస్ట్రేషన్ ఉందా అని ప్రశ్నించారు. అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తే సమావేశానికి వెళ్లవద్దని అధికారులను బెదిరింపులకు గురిచేయడం సరికాదని ఆయన అన్నారు. ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని తాడిపత్రి అభివృద్ధి కోసం ప్రయత్నిస్తే సహకరిస్తామన్నారు.…
రాష్ట్రంలో జగన్ దుర్మార్గపు పాలనకు తోడు పోలీసుల దౌర్జన్యం తోడైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ తీరును తీవ్రంగా విమర్శించారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్టును ఆయన ఖండించారు. సమాజంలో అల్లర్లు సృష్టిస్తూ అరాచకాలు చేస్తున్న వైసీపీ గుండాలను వదలి టీడీపీ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమ నెత్తి మీద 3 సింహాలకు బదులు 3 ఫ్యాన్…
కర్నూలు జిల్లా ఆత్మకూరులో మత విద్వేషాలను రెచ్చగొట్టి, అల్లర్లకు కారణమైన వ్యక్తిని పరామర్శించడానికి ఏకంగా బీజేపీ కేంద్రమంత్రి మురళీధరన్ సబ్ జైల్ కు వెళ్లడం విస్మయానికి గురిచేసిందని హోంమంత్రి సుచరిత అన్నారు. కేంద్ర మంత్రి మురళీధరన్ ఆత్మకూరులో జరిగిన సంఘటనకు సంబంధించిన సమగ్ర వివరాలు తెలుసుకొని ఉంటే బాగుండేదన్నారు. బుడ్డా శ్రీకాంత్ రెడ్డి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని.. మత విద్వేషాలు రెచ్చగొడుతూ.. గొడవకు ప్రధాన కారకుడు అయ్యాడని పోలీసుల విచారణలో తేలినట్లు హోంమంత్రి సుచరిత గుర్తుచేశారు.…
విజయవాడలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ నేత బుద్దా వెంకన్నను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.విజయవాడ వన్ టౌన్ పీఎస్ కు బుద్దా వెంకన్నను తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు అడ్డుపడ్డారు టీడీపీ కార్యకర్తలు.. బుద్దా అనుచరులు. బుద్ధా వెంకన్నపై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 153, 505, 506 సెక్షన్ల కింద FIR నమోదయింది. బుద్దాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మైలవరపు దుర్గారావు. కాసినో వ్యవహారంపై మంత్రి కొడాలి నాని,…
1.గోదావరి యాజమాన్య బోర్డు సబ్ కమిటీ సమావేశం సోమవారం జరిగింది. బోర్డు మెంబర్, సెక్రటరీ పాండే అధ్యక్షతన సబ్ కమిటీ భేటీ అయింది. సమావేశ అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించారు. పెద్దవాగు తప్ప ఇంకే ప్రాజెక్టు ఇవ్వం.. జీఆర్ఎంబీ సబ్ కమిటీ మీటింగ్‌లో తెలంగాణ తేల్చేసింది. తెలంగాణలోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ.. ఏపీలోని వెంకటనగరం లిఫ్ట్ పై సమావేశంలోఈ సమావేశంలో చర్చించారు. 2.2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థలు నూతన టారిఫ్‌లతో ప్రతిపాదనలు…
ఏపీలో వైసీపీ నేతలు టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం రంజుగా సాగుతోంది. టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే గణేష్. నిరంతరం ప్రభుత్వం మీద ఏదోవిధంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత అయ్యన్నకు లేదన్నారు. విలేఖర్లకు పంపిన వీడియోలో టీడీపీ నేతలపై ఎమ్మెల్యే గణేష్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్లకు కేవలం రూ. 12 కోట్లు మీరు బిల్లులు చేస్తే, మా ప్రభుత్వంలో…
1.దళితులపై చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం మాదని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధుపై కాంగ్రెస్, బీజేపీ అనవసర విమర్శలు చేస్తున్నాయన్నారు. దళితులపై బీజేపీ ప్రేమ కల్లబొల్లి మాటల్లోనే తప్ప చేతల్లో చేసిందేమి లేదని హరీష్ రావు అన్నారు. దళిత బంధు వంటి పథకాన్ని దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టాలని.. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చేలా పథకాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. 2.ప్రభుత్వ ఉన్నతాధికారి అయిన తన భర్త…
తనపై వస్తున్న విమర్శలపై మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. తాను రాజీనామా చేయనని, చంద్రబాబుని రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. క్యాసినోలపై ఏపీలో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు వస్తే క్యాసినోలో ఏం జరిగిందో చూపిస్తానన్నారు.