అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత అక్కడ ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష చేయబోతున్నారా? పార్టీ.. ప్రభుత్వం లైన్ దాటి రాజకీయాలు చేస్తున్న వారి లెక్కలు తేల్చేస్తారా? ఈ బాధ్యతను పార్టీలో కీలక నేతకు అప్పగించడంతో శాసనసభ్యులు అలెర్ట్ అయ్యారా? ఎక్కడో.. ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం. అంతర్గతంగా నాయకత్వం మధ్య అనైక్యత పెరుగుతోందా?ఉత్తరాంధ్ర జిల్లాలు రాజకీయ పార్టీల భవిష్యత్‌ను నిర్దేశిస్తాయి. ఇక్కడ సమీకరణాలు.. సీట్లు.. ఓట్లు అధికార-విపక్షాలకు అత్యంత కీలకం. ఒకప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాల్లో టీడీపీదే హవా.…
సినీ నటుడు అలీకి రాజ్యసభ ఛాన్స్ ఉందా? అధికారపార్టీ ఈక్వేషన్స్‌కు ఆయన సరిపోయారా? మరో పోస్ట్‌కు అలీ పేరును పరిశీలిస్తున్నారన్న ప్రచారం ఎందుకు జరుగుతోంది? ఇంతకీ ఏంటా పదవి? అంతా రాజ్యసభ ఖాయం అనేసుకున్నారుఆ మధ్య సినీరంగ సమస్యలపై చిరంజీవి బృందంతో చర్చలు జరిగిన సమయంలో తళుక్కుమన్నారు నటుడు అలీ. అప్పుడే అలీ భుజంతట్టిన సీఎం జగన్ వచ్చేవారం కలుద్దాం అన్నారు. ముఖ్యమంత్రి అలా అన్నారో లేదో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ప్రచారం ఊపందుకుంది. అలీకి…
ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు. మొన్న అర్థరాత్రి టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు అశోక్ బాబును నోటీసు తగిలించి సీఐడీ అధికారులు కిడ్నాప్ చేశారు. విచారణ పూర్తైన ఆరోపణలపై మళ్లీ కేసు నమోదు చేశారు. జగన్ ఉన్మాది ముఖ్యమంత్రి మొదటి ఎఫ్.ఐ.ఆర్.కు సెక్షన్లు ఎందుకు మార్చారు. అశోక్ బాబును అరెస్టు చేసి ఏం విచారణ చేశారు.రాష్ట్రంలో చట్టప్రకారం పాలన జరగాలి.పోలీసులు కూడా చట్టప్రకారమే వ్యవహరించాలి.లేకపోతే ప్రైవేటు కేసులు వేస్తాం.ప్రజలకు…