Actor Ali: అలీకి కీ పదవి లభిస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ నటుడు అలీకి రాజ్యసభ ఛాన్స్ ఉందా? అధికారపార్టీ ఈక్వేషన్స్‌కు ఆయన సరిపోయారా? మరో పోస్ట్‌కు అలీ పేరును పరిశీలిస్తున్నారన్న ప్రచారం ఎందుకు జరుగుతోంది? ఇంతకీ ఏంటా పదవి?
అంతా రాజ్యసభ ఖాయం అనేసుకున్నారు
ఆ మధ్య సినీరంగ సమస్యలపై చిరంజీవి బృందంతో చర్చలు జరిగిన సమయంలో తళుక్కుమన్నారు నటుడు అలీ. అప్పుడే అలీ భుజంతట్టిన సీఎం జగన్ వచ్చేవారం కలుద్దాం అన్నారు. ముఖ్యమంత్రి అలా అన్నారో లేదో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ప్రచారం ఊపందుకుంది. అలీకి రాజ్యసభ ఖాయం అని అంతా అనేసుకున్నారు కూడా. వైసీపీకి ముందు నుంచి అలీ మద్దతుదారుగా ఉన్నారు. గతఎన్నికల్లో పార్టీకోసం ప్రచారం కూడా చేశారు. అంతకుమించి సామాజికవర్గాల సమీకరణాలో ఫిట్ అయ్యారు అలీ. రాజ్యసభకు వైసీపీలో ముస్లింల నుంచి ఎవరూ లేరు. పైగా పదవుల పంపకాల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ ఈక్వేషన్లకు అనుగుణంగానే ఇప్పటి వరకు పదవుల పంపకం జరిగింది. అందుకే అలీ పేరు విస్తృత చర్చకు కారణమైంది.
Also Read
- AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. గెలిచేదెవరో?
- Cyclone Murasu: తీరం దాటిన మురసు తుఫాన్.. ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు!
- OTR: ఆ మూడు చోట్లే కోట్ల పందాలు.. బెట్టింగ్ రాయుళ్ల లెక్కలేంటి?
- Tamil Nadu: ఏపీకి పెట్టుబడులు.. విజయ్ సర్కార్‌పై అన్నామలై, డీఎంకే ఫైర్..
కూడికలు.. తీసివేతల తర్వాత అలీ పేరు పక్కకు జరిగిందా?
సినీగ్లామర్ కూడా అలీకి ఉన్న అదనపు అర్హత. వీటన్నింటిని బేరీజు వేసుకుని అలీకి రాజ్యసభ సీటు రిజర్వ్ అయ్యిందనే చర్చ సాగింది. వాస్తవంగా కూడా రాజ్యసభకు అవకాశం ఎవరికి ఇవ్వాలన్న చర్చ వచ్చినప్పుడు అలీ పేరు పార్టీ పరిశీలనలోకి వెళ్లిందట. అనేక కూడికలు, తీసివేతల తర్వాత పెద్దలసభ ప్రతిపాదన నుంచి అలీ పేరు పక్కకు జరిగిందని సమాచారం.
అలీని వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌ను చేసే ఆలోచన ఉందా?
రాజ్యసభ సభ్యత్వం బదులు వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ పదవిని సినీ నటుడు అలీకి ఇవ్వాలనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు సమాచారం. వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ గిరి కూడా రాష్ట్రస్థాయి పోస్ట్ అని.. ముస్లింలకు సంబంధించి కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వక్ఫ్ బోర్డు ఆస్తుల సంరక్షణతోపాటు వివాదాలకు అవకాశం లేకుండా బాధ్యతలు నిర్వర్తించే వారు అవసరమనే ఆలోచనలో వైసీపీ ఉందట. ఆ కోవలో నాన్ కాంట్రవర్సీ ఇమేజ్ ఉన్న అలీ సరైన ఛాయిస్ అవుతారని అభిప్రాయపడుతున్నట్టు సమాచారం.
ఎన్నికల్లో పోటీ చేయడానికి పదవి ఊతమేనా?
త్వరలోనే అలీకి కీలక బాధ్యతలు కట్టబెడతారని వైసీపీ వర్గాలు కూడా గట్టిగానే చెబుతున్నాయి. గత ఎన్నికల్లోనే ఆయన పోటీ చేయాలని చూశారు. ఆ అవకాశం దక్కలేదు. వచ్చే ఎన్నికల్లోనైనా బ్యాలెట్ వార్‌లోకి దిగాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే ప్రస్తుతం ఏ పదవి ఇచ్చినా.. లక్ష్యం దిశగా అలీ అడుగులు వేయడానికి అది ఉపయోగపడుతుందని అనుకుంటున్నారట. మరి.. అధికారపార్టీలో అలీ లక్ ఎలా ఉందో చూడాలి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. గెలిచేదెవరో?
-
Breast Cancer: 17ఏళ్లకే బ్రెస్ట్ క్యాన్సర్.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి!
-
Monkey Branching: డేటింగ్లో కొత్త ట్రెండ్.. మంకీ బ్రాంచింగ్ అంటే ఏంటి?
-
Lancet Report: 22 లక్షల మరణాలకు కారణం ఇదే! లాన్సెట్ నివేదిక బయటపెట్టిన నిజం
-
Bhuvneshwar Kumar: భువీ చాప్టర్ క్లోజ్.. మహమ్మద్ షమీ రీ-ఎంట్రీ..? ఇవిగో ప్రూఫ్స్..
-
Alcohol : బీర్, వైన్, విస్కీ, వోడ్కా.. ఏది ఎక్కువ డేంజర్?
ట్రెండింగ్
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!