Botsa Satyanarayana: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పులివెందుల ఎన్నికలను ప్రభుత్వం అపహాస్యం చేసింది.. ఎన్నికలు అంటే ప్రభుత్వానికి ఎందుకు భద్రతాభావం కలుగుతుందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
Minister ParthaSarathy: రాష్ట్రంలో వర్షాలు, వరదలతో పాటు ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికినకైనా ప్రభుత్వం రెడీగా ఉందని మంత్రి పార్థసారధి తెలిపారు. ఇక, పులివెందుల, ఒంటిమిట్టలలో గెలుపు ఉత్సాహం నింపింది.. వైసీపీ గెలిస్తేనే ప్రజాస్వామ్యం ఉన్నట్టా అని ప్రశ్నించారు.
Perni Nani: జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు టీడీపీ నేతలకు పులివెందుల ఎన్నికలు కాంట్రాక్ట్ కి ఇచ్చినట్లు ఉన్నారని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆడవాళ్ళ ఓట్లు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లు వేసి వెళ్ళారు.. సిగ్గు, శరం లేకుండా బరితెగించి రాజకీయాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM Chandrababu: పార్టీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పలువురికి ఆర్థిక సాయం నిధులు చేశారు. అనంతరం నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించారు. అనంతరం మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్‌చాట్ నిర్వహించారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై పూర్తి అప్రమత్తతో ఉన్నామన్నారు.
Chevireddy Bhaskar Reddy: విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గర మరోసారి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హల్ చల్ చేశారు. రిమాండ్ పొడిగించిన తర్వాత జైలుకి తీసుకు వెళ్తుండగా మీడియాతో మాట్లాడారు. తనను అక్రమంగా లిక్కర్ కేసులో ఇరికించారని.. తనకు లిక్కర్ స్కాంకు ఎటువంటి సంబంధం లేదన్నారు. కేసులో సిట్ అధికారులు అక్రమంగా ఇరికించారు, ఈ విషయం సిట్ కి కూడా తెలుసన్నారు. తన తండ్రి లిక్కర్ తాగి చనిపోయారు తాను లిక్కర్ జోలికి వెళ్ళనని…
Pulivendula ZPTC By-Election Tensions: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికార టీడీపీ, వైసీపీ నాయకులు మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా హీట్ పెరిగింది. తాజాగా వైసీపీ కార్యాలయానికి వచ్చిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని ఆఫీసులోనే నిర్బంధించారు. ఇది తెలిసిన వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పోలీసులు వాళ్లను పంపించే ప్రయత్నం చేశారు. పోలీసులు,…
Pulivendula: కడప జిల్లా పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి ఇవాళ (ఆగస్టు 10న) సాయంత్రం 5గంటలకు తెర పడనుంది. ఈ మేరకు మంగళవారం (ఆగస్టు 12న) నాటి పోలింగ్‌కు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది.
రోడ్డు రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి వైసీపీ పార్టీపై నిప్పులు చెరిగారు. తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు చంద్రబాబు శ్రమిస్తున్నారన్నారు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ… రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. సింగపూర్ లాగా అమరావతిని అభివృద్ధి చేస్తామని పదేళ్ల ముందే మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇందుకు అనుగుణంగా సింగపూర్ ప్రభుత్వ ఆర్కిటెక్ లతో అద్భుతమైన డిజైన్ చేయించారన్నారు. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం వేల కోట్ల…
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతలను ఎన్డీయే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసుకుని మరి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఏపీలో తాలిబాన్ల పాలన నడుస్తోంది.. ప్రజా ప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదన్నారు.