వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ సారి లేఖలో ఏపీ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ.. విచారణ జరిపించాలని కోరారు. ఇటీవల ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ ఇచ్చిన నివేదికలను పరిగణనలోకి తీసుకోని సీబీఐ ఆర్థిక నేర విభాగంతో గానీ, లేదంటే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో)తో విచారణ జరిపించాలని లేఖలో ప్రధానికి కోరారు. అంతేకాకుండా ప్రభుత్వ బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలపైనా విచారణ చేపట్టాలని, కార్పొరేషన్ల ద్వారా…
Rajahmundry MP Margani Bharath Ram Made Comments on TDP. గత మూడేళ్లలో దేశ సగటు కంటే మిన్నగా ఏపీ రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో సాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఏడాదికి సగటున రాష్ట్ర తలసరి ఆదాయం రూ.12,025 పెరిగిందని, కోవిడ్ సంక్షోభంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.17,913 పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచి…
APCC Working President Narreddy Tulasi Reddy Fired on BJP. బీజేపీ రణభేరిపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం ఆయన మాట్లాడుతూ.. కడపలో బీజేపీ రణభేరి సభ పెట్టి మరోసారి రాయలసీమ ప్రజలను మోసం చేయాలని చూస్తోందని, కడపలో బీజేపీ పార్టీ పెట్టిన సభ లాలూచీ, కుస్తీ సభ అని ఆయన మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ 5 ఏళ్ళు ప్రకటిస్తే దాన్ని బీజేపీ అమలు చేయలేదన్నారు. బీజేపీ…
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. పరిపాలన సౌలభ్యం ఉండాలంటే అధికార వికేంద్రీకరణ జరగాలని, జిల్లాల విభజన స్వాగతించాల్సిన అంశం అన్నారు.జిల్లాల విభజన వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. పరిపాలన సౌలభ్యం పెరుగుతుందన్నారు. ఇప్పటికే ప్రజలకు పరిపాలన చేరువ అయ్యేలా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాంలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. దానిలో…
విజయవాడ ఉంగటూరు పోలీస్ స్టేషన్ ఉంగటూరు పోలీస్ స్టేషన్ నుండి సోము వీర్రాజు విడుదల అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు వైసీపీ పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ దెబ్బకి వైసీపీ ప్రభుత్వం, మంత్రి ఓడిపోయాడన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని మమ్ముల్ని ఆపాలని చూశారు. సంక్రాంతి సంబరాలు ఎలా జరపాలో మా కార్య కర్తలు గుడివాడ నానికి చూపించారని చురకలు అంటించారు. ఢిల్లీలో తోకలు పట్టుకుని తిరిగే పార్టీలు మాపై కామెంట్లు చేస్తున్నాయన్నారు.…
కేసీనో విషయంలో దొంగ పోలీసులు ఒక్కయ్యారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. గుడివాడకు వెళ్లటం ఖాయం మేము చేయాల్సిన కార్యక్రమం చేసి తీరుతామని సీఎం రమేష్ అన్నారు. గుడివాడకు వెళ్ళకుండా ఎందుకు అవుతున్నారు.. క్యాసినో వ్యవహారం తేలుస్తామన్నారు. గుడివాడ డీఎస్పీకి తెలియకుండా మూడు రోజులు క్యాసినో జరిగిందా.. అని సీఎం రమేష్ ప్రశ్నించారు. క్యాసినో పేరుతో ఇప్పటి వరకు ఎంత వసూలు చేశారో చెప్పాలన్నారు. Read Also: బీజేపీ నేతల అరెస్టులకు సీఎం జగన్ బాధ్యత…
ఏపీబీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలో “సంక్రాంతి సంబరాలు” ముగింపు కార్యక్రమలకు గుడివాడ వెళ్తున్న బీజేపీ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడారు. పోలీసులు ఏ నిబంధనలతో బీజేపీ నాయకులను అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసి బస్సుల్లో తరలించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించడమేంటని ఆయన మండిపడ్డారు. అధికార దాహానికి, అధికార మదానికి హద్దు ఉంటుందని వైసీపీకి చురకలంటించారు.…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్గా ఉన్నాయి. ప్రస్తుత రాజకీయాలు టీడీపీ ఎమ్మెల్యే బుద్ధావెంకన్న వర్సెస్ మంత్రి కొడాలినానిగా మారాయి. ఒకరిపై ఒకరూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా చిన్నపాటి మినీ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. మంగళవారం బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. మంత్రి కొడాలి నానిపై ఫైర్ అయ్యారు. మంత్రి కొడాలి నానిది దొంగతనాలు చేసే బతుకు.. కొడాలి నానికి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని బుద్ధా అన్నారు. కొడాలి నాని పాన్ పరాగ్…
టీడీపీ నేత బుద్ధా వెంకన్నను అరెస్టు చేయడంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో కొడాలి నాని క్యాసినో నడిపితే నో పోలీస్…? అదే గడ్డం గ్యాంగ్ ప్రతిపక్షనేతని బూతులు తిడితే నో పోలీస్.. చంద్రబాబు గారి ఇంటి పై దాడి చేస్తే నో పోలీస్…టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని వైసీపీ మూకలు ధ్వంసం చేస్తే నో పోలీస్.. ? అంటూ లోకేష్ ప్రశ్నించారు. బూతులేంట్రా సన్నాసి నాని అని బుద్ధా వెంకన్న…
ఏపీలో మరోసారి టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రైతు రుణ విముక్తి విషయంలో ఏమి జరిగిందో, లక్ష కోట్లు 20 వేల కోట్లు ఎలా అయ్యాయో అందరికీ తెలుసునని అన్నారు. అంతేకాకుండా మీడియా ముసుగులో దశబ్దాలు తరబడి టీడీపీ కోసం రౌడీయిజం, రుబాబు చేస్తున్నారని, చంద్రబాబు వస్తే అంతా ప్రశాంతంగా ఉంటుంది అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పథకాలను రోజూ…