Chelluboyina Venu: కార్తీక వనసమరాధన కార్యక్రమాల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన విమర్శలు అర్థరహితం అని వైసీపీ నేత చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ అన్నారు. శెట్టి బలిజ సామాజిక వర్గం గతంలో మంత్రి సుభాష్ వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు.. శెట్టి బలిజ సామాజిక వర్గాన్ని గౌడ కులంలో చేర్చాలనే ప్రతిపాదనలు వైసీపీ ప్రభుత్వం చేసిందనటం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనం.. జూలై 2025 వరకు అసలు అలాంటి ప్రక్రియ ప్రారంభం కాలేదు.. ఆ జీవోపై ఆందోళనలు రావటంతో నెపాన్ని వైసీపీ మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మీ టీడీపీ ప్రభుత్వం 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ మార్పుపై ఒక జీవో కూడా ఇచ్చారని మాజీ మంత్రి చెల్లబోయిన వేణు పేర్కొన్నారు.
అయితే, ఆ విషయాన్ని కప్పిపుచ్చి ఇదంతా వైసీపీ చేస్తుందనేలా అనుమానాలు రేకెత్తిస్తున్నారు అని మాజీ మంత్రి శ్రీనివాస వేణుగోపాల్ తెలిపారు. గతంలో ఇలాగే మాట్లాడి నేను తప్పు చేశానని నా దగ్గరకు వచ్చి ఒప్పుకున్నారు.. కుల సంఘ పెద్దలైనా మంత్రి వాసంశెట్టి సుభాష్ తో మాట్లాడి అసలు నిజాలు చెప్పించాలి అని డిమాండ్ చేశారు. కులాన్ని.. కులంలో కొంత మందిని దూషించటానికి వన భోజనాలను కూడా అడ్డం పెట్టుకున్నారని విమర్శించారు.