Malladi Vishnu: టీటీడీ పాలకమండలి సభ్యుడు, మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీతను అవమానించేలా మాట్లాడారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. భారతదేశంతో పాటు ప్రపంచానికే ఆదర్శంగా ఉన్న భగవద్గీతను చులకనగా మాట్లాడారు.. భగవద్గీతను కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేని టీటీడీ పాలకవర్గ సభ్యుడిగా ఎలా కొనసాగిస్తారు అని ప్రశ్నించారు.
Perni Nani: ఏపీలో మద్యం అమ్మకాల్లో క్యూఆర్ కోడ్ తామే ప్రవేశపెట్టమన్నట్లుగా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇది తామే కనిపెట్టినట్లుగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని.. అన్నీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంటే సారా మంత్రి ఏమి చేస్తున్నారని విమర్శించారు.. జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం బాటిల్ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే ముందే క్యూఆర్ కోడ్ తోనే వచ్చేదని.. ఇప్పుడు అదేదో ఘన కార్యంలా చెప్పుకుంటున్నారన్నారు.. మీరు రాగానే…
YS Jagan: అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం తయారీపై మాజీ సీఎం స్పందించారు. నకిలీ లిక్కర్ తయారీలో రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా తీర్చదిద్దాలని కంకణం కట్టుకున్నారా.? టీడీపీ నేతలు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీని పెట్టి సప్లై చేస్తున్నార అని ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. నకిలీ మద్యానికి సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నారు.
MLC Lella AppiReddy: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, వ్యవస్థలను పతనం చేసి గెలిచారని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. ఓటింగ్ కు ముందు పోలింగ్ కేంద్రాలను మార్చి ఓటర్లకు గందరగోళానికి గురి చేశారని పేర్కొన్నారు.
రాజకీయం ఎలా చేయాలో కూడా తెలియని వ్యక్తి జగన్ అని వంగలపూడి అనిత పేర్కొనింది. విలువులతో కూడిన రాజకీయాలు చేయ్.. మేము కూడా స్వాగతిస్తామన్నారు. పోలీస్ ఉద్యోగాలు తీయడానికి ఆయన ఎవరు.. నిత్యం ఖాకీ చొక్కా వేసుకుని వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు.. గత ఐదేళ్లు పోలీస్ శాఖతో ఊడిగం చేయించుకున్నాడు.. ప్రతి పనికి పోలీసులను వాడుకున్నాడు.
Pilli Subhash Chandra Bose: పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ నేత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలపై అందరికీ నమ్మకం పోయింది.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పై నమ్మకం లేదు.. బీజేపీ మినహా అని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని వెల్లడించారు.
గతంలో ఉన్న ఈడీ కేసుల్లో జగన్ అరెస్ట్ కావడం ఖాయమని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన మాట్లాడారు. జగన్ హయాంలో అవినీతిలేని డిపార్ట్‌మెంట్ లేదని.. జగన్ ఖచ్చితంగా జైలుకు వెళతారు.. తప్పలు చేసినవారిక శిక్ష తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును 53రోజులు జైల్లో ఉంచి ఏం నిరూపించగలిగారు?