విజయదశమి పండుగ సమయంలో టీడీపీ నిరసనలపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసుల అలర్ట్ అయ్యారు. జగనాసుర దహనం పేరిట నిరసనలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ నిరసనల వల్ల హింస చెలరేగే అవకాశం ఉందని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో శని, ఆదివారాల్లో జరిగిన ఎస్సై మెయిన్స్ పరీక్షల ప్రిలిమినరీ 'కీ' విడుదలైంది. ఈ రెండు రోజుల్లో విశాఖ, గుంటూరు, ఏలూరు, కర్నూలు నగరాల్లో ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్షలు ప్రశాంతంగా ముగియగా.. ఆదివారం సాయంత్రం ప్రాథమిక కీ విడుదలైంది.
రాష్ట్రం కోసం చావడానికైనా సిద్ధం కానీ ఈ ప్రభుత్వం ఒత్తిళ్లకు లొంగమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. మా కుటుంబాల మీద రోజా చేసిన వ్యాఖ్యలు ఆధారాలతో సహా ఇస్తాం మంత్రి మీద కేసు పెట్టే దమ్ము పోలీసులకు ఉందా అంటూ అయ్యన్న సవాల్ విసిరారు.
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
నేడు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన పీఏసీ సమావేశం కానుంది. ఈ మీటింగ్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరుకానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం జరుగనుంది.