ప్రకాశం జిల్లా ప్రజలంతా మాగుంట కుటుంబానికి అండగా నిలబడాలని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నేటి రాజకీయాల్లో విలువలు లేకుండా పోతున్నాయని ఆయన అన్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై రెండవ రోజు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. చంద్రబాబు హెల్త్ బులెటిన్నుసెంట్రల్ జైల్ ఇంఛార్జి సూపరిండెంట్ రాజ్‌కుమార్ విడుదల చేశారు.
పేద వారికి అభివృద్ధి చేయాలంటే నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అక్కర్లేదని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. మాటిస్తే మాట నిలబెట్టుకునే తత్త్వం సీఎం జగన్‌ది అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సామర్లకోట పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ వద్ద వివిధ వైద్య అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి ఆర్థిక సహాయం కోరుతూ ముఖ్యమంత్రికి వినతులు అందించగా.. తప్పకుండా ఆదుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
ప్రజలు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకునే విషయంలో ప్రభుత్వం మరింత వెసులుబాటు కల్పించింది. ఒకసారి కుల ధ్రువీకరణ పత్రం జారీ చేస్తే దానిని శాశ్వతంగా పరిగణించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు స్పష్టం చేసింది.
హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చి ఉచిత వసతి పొందుతున్న ఉద్యోగుల వివరాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. విభాగాల వారీగా ఫ్రీ అకామిడేషన్ పొందుతున్న వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర నుంచి ముఖ్యమంత్రి జగన్ తో గౌతమ్ అదానీ సమావేశం కొనసాగుతుంది. విశాఖపట్నంలో డేటా సెంటర్, గంగవరం, కృష్ణపట్నం పోర్టు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
అమరావతిలో పార్టీ కార్యకర్తలతో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలోని ప్రతీ ఒక్కరూ పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ పార్టీ కంటే ఎక్కువ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించమని ప్రతిజ్ఞ చేయాలని కోరారు.