వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. రేషన్ బియ్యం గోదాముల్లో తగ్గటంపై కేసు నమోదు నేపథ్యంలో అధికారులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. వారం రోజులుగా పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అందుకే వారిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. పేర్ని నాని సోమవారం సాయంత్రం అజ్ఞాతం నుంచి బయటకొచ్చారు. పేర్ని నాని సతీమణి జయసుధ ఇంకా అజ్ఞాతం వీడలేదు.…
శ్రీవారి భక్తుల అలర్ట్: శ్రీవారి భక్తుల అలర్ట్. 2025 మార్చికి సంబంధించిన సుప్రభాతం, తోమాల, అష్టదళపాద పద్మారాధన సేవల ఆర్జిత సేవా టికెట్ల కోటాను డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. ఇందులోనే లక్కీడిప్ కోటా కోసం డిసెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఆన్‌లైన్‌లో…
నేడు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలోని గుట్టపల్లి, సోమవరం, శెట్టిపల్లి గ్రామాలలో జరిగే రెవెన్యూ సదస్సులలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. ఈరోజు మంగళగిరిలో జరగనున్న ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు విజయవాడ చేరుకుని.. మధ్యాహ్నం 12.05 గంటలకు మంగళగిరి ఎయిమ్స్‌కు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఎస్సీ ఉపకులాల…
కూటమి ప్రభుత్వ పాలనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో వాగ్దానం చేసిన ‘సూపర్ సిక్స్’ పథకాలు అమలు కావటం లేదని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. విజన్ డాక్యుమెంటరీపై చర్చలు జరపాలని తాను సీఎం చంద్రబాబు నాయుడుకి సవాల్ విసురుతున్నా అని అన్నారు. సినిమాకి పెట్టుబడి పెట్టి టికెట్లు అమ్ముకుంటున్నారని, రైతులు ఎండ వాన చూడకుండా పెట్టుబడి పెట్టి పంట పండిస్తే కనీస మద్దతు ధర…
2047 విజన్ అనేది వ్యక్తి కోసం, కులం కోసం కాదని.. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు తెచ్చేందుకు ఇచ్చే హామీ అని సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లలో ఇంత స్వేచ్చగా రాష్ట్రంలో మాట్లాడుకున్నామా? అని సీఎం ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో అభివృద్ధి పనులు చేయాలని ఆదేశాలు ఇస్తే.. వాటిని వైసీపీ రద్దు చేసిందని మండిపడ్డారు. 3 రాజధానుల పేరుతో అమరావతిపై కక్షతో వ్యవహరించారని, పోలవరంను నాశనం చేసి పక్కన పెట్టారని ధ్వజమెత్తారు.…
ఐదేళ్ల పాలన స్వార్థ రాజకీయాలకు నిదర్శనం: వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు. స్వార్థ పరమైన వ్యక్తులు అధికారపీఠం ఎక్కితే.. ఏం నష్టం జరుగుతుందో గత ఐదేళ్లలో జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించకుండా నాశనం చేశారని, గత ప్రభుత్వ పాలన వల్ల భూముల ధరలు పడిపోయాయని మండిపడ్డారు. మరో సైబరాబాద్ నిర్మాణం ఏపీలో సీఎం చంద్రబాబు విజన్ వల్ల ఏర్పాటు అవుతుందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. సమాజంలో…
వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు. స్వార్థ పరమైన వ్యక్తులు అధికారపీఠం ఎక్కితే.. ఏం నష్టం జరుగుతుందో గత ఐదేళ్లలో జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించకుండా నాశనం చేశారని, గత ప్రభుత్వ పాలన వల్ల భూముల ధరలు పడిపోయాయని మండిపడ్డారు. మరో సైబరాబాద్ నిర్మాణం ఏపీలో సీఎం చంద్రబాబు విజన్ వల్ల ఏర్పాటు అవుతుందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. విజయవాడలోని టీడీపీ ఆఫీసులో శ్రీ పొట్టి శ్రీరాములు…
తల్లి మృతి చెందడంతో ముగ్గురు చిన్నారులను అల్లారు ముద్దుగా చూసుకుంటున్న తండ్రి కథ విషాదంగా ముగిసింది. ఏలూరులో నిన్న అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తి కేసును విచారణ చేపట్టిన పోలీసులు దారుణ వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు. కూతుర్ని వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిని తండ్రి హెచ్చరించడంతో.. కక్ష పెంచుకుని తండ్రిని హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఏలూరు ఓవర్ బ్రిడ్జి కింద 39వ పిల్లర్ వద్ద నివాసం ఉంటున్న షేక్ వెంకట కనకరాజు భార్య…
సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆడ పిల్లలను ఎంత బాధ్యతగా పెంచుతామో.. మగ పిల్లలను కూడా అలాగే పెంచాలన్నారు. కావాలని ఎవ్వరూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడరని, పిల్లలపై తల్లిదండ్రుల నిఘా ఎప్పుడు ఉండాలని సూచించారు. రాష్ట్రంలో మత్తు పదార్ధాలు లేకుండా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని హోంమంత్రి తెలిపారు. ‘ఆడ బిడ్దలను రక్షిద్దాం.. సమాజాన్ని కాపాడుకుందాం’ అని పిలుపునిచ్చారు. ఆడ పిల్లలను కాపాడాలనే నినాదంతో ‘సేవ్ ది గర్ల్…
సోమవారం రేపు పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ప్రాజెక్టు పనులు పరిశీలన అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఆపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల షెడ్యూల్‌ను కూడా సీఎం విడుదల చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటన నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సీఎం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. 2024 ఏపీ అసెంబ్లీ…