వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు. స్వార్థ పరమైన వ్యక్తులు అధికారపీఠం ఎక్కితే.. ఏం నష్టం జరుగుతుందో గత ఐదేళ్లలో జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించకుండా నాశనం చేశారని, గత ప్రభుత్వ పాలన వల్ల భూముల ధరలు పడిపోయాయని మండిపడ్డారు. మరో సైబరాబాద్ నిర్మాణం ఏపీలో సీఎం చంద్రబాబు విజన్ వల్ల ఏర్పాటు అవుతుందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.
విజయవాడలోని టీడీపీ ఆఫీసులో శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పార్థసారథి.. వచ్చే ఏడాది నుంచి పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినంగా నిర్వహిస్తాం అని తెలిపారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ… ‘వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. స్వార్థ పరమైన వ్యక్తులు అధికారపీఠం ఎక్కితే ఏం నష్టం జరుగుతుందో గత ఐదేళ్లలో చూశాం. పోలవరం నిర్మించకుండా నాశనం చేశారు. గత ప్రభుత్వ పాలన వల్ల భూముల ధరలు పడిపోయాయి. రైతుల ధాన్యంకి డబ్బులు ఇవ్వకపోతే.. మేమే అధికారంలోకి వచ్చాక డబ్బులు చేల్లించాం. మరో సైబరాబాద్ నిర్మాణం ఏపీలో చంద్రబాబు విజన్ వల్ల ఏర్పాటు అవుతుంది. వచ్చే ఏడాది నుంచి పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినంగా నిర్వహిస్తాం’ అని అన్నారు.