జగన్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. వివిధ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతస్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తొలివిడత 4,314 డిజిటల్ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ లైబ్రరీలకు అవసరమయ్యె ఇంటర్నెట్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని, అప్పుడే వర్క్ హోం కాన్సెప్ట్ విజయవంతం అవుతుందన్నారు. దీంతో పాటు రైతు భరోసా రెండో విడత కార్యక్రమాన్ని…
టీడీపీ నేతలపై ఎంపీ విజయసాయిరెడ్డి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని బూతులు తిడుతూ రాజకీయాలు చేయడం సమంజసం కాదన్నారు. ఏపీలో టీడీపీ కనుమరుగవుతుందనే భయంతోనే విపక్షం అడ్డదారులు తొక్కుతోందని ఆయన అన్నారు. చంద్రబాబు కనుసన్నల్లోనే ఇలాంటి ఘటనలకు తెరలేపారన్నారు. పట్టాభిరామ్ సీఎంపై చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు తెలియకుండా చేశాడా అంటూ ప్రశ్నించారు. ఇదంతా చంద్రబాబు ఆడుతున్న నాటకమని, ఈ గందరగోళానికి కేడర్ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్షకు ప్రారంభించారు.…
రెండు రోజులుగా ఏపీ మొత్తం టీడీపీ, వైసీపీ ల నిరసనలతో అట్టుడికిపోతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. పార్టీ కార్యాలయం అంటే దేవాలయం వంటిదని, ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపితే పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తారా..? అంటూ ప్రశ్నించారు. నేతల భాష విషయంలో జగన్ చర్చకు సిద్దమా..? అని సీఎం జగన్ కు సవాల్ విసిరారు.…
ఏపీలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ ఈ రోజు చంద్రబాబు ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఓవైపు టీడీపీ నేతలు వైసీపీ సర్కార్ తీరుపై దుమ్మెత్తిపోస్తుంటే.. మరోవైపు వైసీపీ నేతలు సీఎం గురించి ఎవరూ అనుచితంగా మాట్లాడినా సహించేది లేదంటున్నారు. ఇదిలా ఉంటే.. ట్విట్టర్ వేదికగా నారా లోకేష్.. ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి అని గౌరవించి గారూ అనేవాడినని, నీ వికృత, క్రూర…
ఏపీలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖలు రాశారు. టీడీపీ కార్యాలయంపై దాడులను ఖండిస్తూ ఆయన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిషా లకు లేఖలు రాశారు. ఈ దాడులపై విచారణ చేపట్టేందుకు సీబీఐ, ఎన్ఐఏలను రంగంలోకి దించాలని కోరారు. అంతేకాకుండా ఇలానే ఉంటే ఏపీ పరిస్థితులు మరింత దిగజారిపోతాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పోలీసులపై నమ్మకం పోయిందని, వెంటనే కేంద్ర బలగాలను రాష్ట్రంలో దించాలని…
ఏపీలో రాజకీయం రాజుకుంది. అటు టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా టీడీపీ ఈ రోజు ఏపీ బంద్ కు పిలుపునిస్తే.. కౌంటర్ గా వైసీపీ కూడా టీడీపీ నేతల వ్యాఖ్యలపై నిరసనలకు తెరలేపింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి జవహార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలు, పార్టీ నాయకులపై దాడులు ద్వారా అంతర యుద్ధం జరగాలని జగన్ కోరుకున్నాడని ఆరోపణలు చేశారు. జగన్ తన రాక్షస మనస్తత్వాన్ని బయట పెట్టాడని విమర్శించారు.…
జగనన్న తోడు నిధులు ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి జమ చేయనున్నారు.తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు జగన్ సర్కార్ జగనన్న తోడు కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే 2020 నవంబర్ నుండి 2021 సెప్టెంబర్ వరకు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన లబ్దిదారులకు ఈ ప్రయోజనం అందనుంది. ఈ పథకం వల్ల 4,50,546 మంది చిరు వ్యాపారస్తులు…