Crime News: లోన్ యాప్ వేధింపులు రోజురోజుకు పెచ్చు మీరుతున్నాయి. వాటి వేధింపులు తట్టుకోలేక ఇటీవల చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు వాటిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించుకుంటున్నా.. చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. దీంతో వాటి వేధింపులకు అంతులేకుండా పోతోంది. ఎందరో చిన్న వయస్సులోనే వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకుంటున్నారు. వడ్డీలకు వడ్డీలు వేస్తూ లోను తీసుకున్న వారిని వేధిస్తుండడంతో ఎలా కట్టాలో తెలియక అభం శుభం తెలియని యువత ప్రాణాలు తీసుకుంటున్నారు.
Read Also: Lakshmi Elephant : ఏనుగు ఆకస్మిక మృతి.. విచారం వ్యక్తం చేసిన గవర్నర్ తమిళసై
ఈ మధ్యకాలంలోనే పదుల సంఖ్యలో యువత ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా అనంతపురం జిల్లా గుత్తి రైల్వే జంక్షన్ సమీపంలో రైలు కింద పడి బీటెక్ విద్యార్థి అఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. అఖిల్ బెంగుళూరులో బీటెక్ చదువుతున్నాడు. చనిపోయిన యువకుడిది గుంతకల్ పట్టణం తిలక్ నగర్ వాసిగా గుర్తించారు. లోన్ యాప్ వేధింపులే ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. కుటుంబ సభ్యులు ఆరోపణలపై వివరణ ఇస్తూ అఖిల్ లోన్ యాప్ బాధితుడు కాదంటున్నారు. లోన్ అప్ వల్ల చనిపోయాడంటూ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.