మూడో రోజుకు చేరిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నేటితో మూడో రోజుకు చేరింది. ఇవాళ గుండెగావ్, మహాగావ్ మీదుగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.
నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటన
నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటించనున్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటైన అక్బర్ పేట-భూంపల్లి మండల రెవెన్యూ కార్యాలయాన్ని మంత్రి హరీష్‌రావు ప్రారంభించనున్నారు.
బెయిల్ మంజూరు.. ఇంటికి చేరుకున్న షర్మిల
వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇంటికి చేరుకున్నారు షర్మిల. షర్మిల ఇంటి దగ్గరే వైఎస్ విజయమ్మ ఉండి షర్మిలకు హారతి ఇచ్చారు. వ్యక్తిగత పూచీకత్తులపై బెయిల్ ఇచ్చింది. షర్మిలతో పాటు మరో ఐదుగురికి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రిమాండ్ విధించాలని పోలీసులు కోరగా తమ క్లయింట్ పై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని షర్మిల పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తే అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆమె ఆరోపించగా.. పోలీసులు అరెస్ట్ చేసిన తీరును తప్పుబట్పటారు షర్మిల తరఫు లాయర్లు. అయితే.. ఇరుపక్షాల వాదనలు విన్న మేజిస్ట్రేట్ షర్మిలకు బెయిల్ మంజూరు చేశారు.
నేడు ఐటీ ముందుకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు
మంత్రి మల్లారెడ్డి పై సోదాల కేసులో ఐటీశాఖ విచారణ ముమ్మరం కొనసాగతుంది. రెండో రోజు ఆదాయపన్ను శాఖ అధికారులు చేపట్టిన విచారణ ముగిసింది. మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇవాళ మరోసారి విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఐటీ అధికారులు ఇద్దరికీ నమూనా ప్రతాలు ఇచ్చారు. నిర్దేశించిన సమాచారాన్ని సమర్పించాలని ఆదాయపు పన్నుశాఖ అధికారులు సూచించారు. నిన్న ఐటీ అధికారుల ఎదుట 9 మంది హాజరుకాగా.. మల్లారెడ్డి ఆడిటర్ సీతారామయ్య సహా కళాశాలకు చెందిన సిబ్బందిని అధికారులు విచారించారు.
సంగీతం గ్రామంలో నాటు తుపాకుల కలకలం
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం సంగీతం గ్రామంలో నాటు తుపాకుల కలకలం రేపాయి. సంతోష్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లో గంజాయి సాగు చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ అధికారులు తనిఖీలకు వెళ్లారు. తనికీలు చేసిన అధికారులకు షాక్ తిన్నారు. ఆప్రాంతంలో.. పలు గంజాయి మొక్కతో పాటు ,రెండు నాటు తుపాకులు పట్టుబడ్డాయి. ఇంట్లోనే నాటు తుపాకులు తయారు చేయడమే కాకుండా.. జంతువులు వేలకు ఉపయోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. దీంతో ఎక్సైజ్ అధికారులు నిందితున్ని అదుపులో తీసుకుని బాన్సువాడ పోలీసులకు అప్పగించారు.
Read also: Guns Seized in Kamareddy: కామారెడ్డిలో నాటు తుపాకుల కలకలం..
నేడు మదనపల్లికి సీఎం జగన్..
నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తన పర్యటన సందర్భంగా జగనన్న విద్యాదీవెన పథకం కింద నాలుగో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఉదయం 9 గంటలకు సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి ఉదయం 9:30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉ.11:10 గంటలకు మదనపల్లి బీటీ కళాశాలకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి ఉ.11:30 గంటలకు టిప్పు సుల్తాన్ మైదానంలో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. సాయంత్రం 3:30 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.
Read also: Giriraj Singh: లవ్ జిహాద్ రూపంలో ఉగ్రవాదం కుట్ర పన్నుతోంది
‘లవ్ జిహాద్’ పై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం ‘లవ్ జిహాద్’ అనేది కొత్తం రూపం దాల్చిందని బాంబ్ పేల్చారు. మాజీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌రాయ్ వర్ధంతి సందర్భంగా మహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. లవ్ జిహాద్ రూపంలో ఉగ్రవాదం ‘సనాతన ధర్మాన్ని’ అంతం చేసేందుకు మురికి కుట్ర పన్నుతోందన్నారు. ఆ కుట్రను భగ్నం చేయాలంటే.. మనమంతా ఏకం అవ్వాలని పిలుపునిచ్చారు. అంతేకాదు.. బిహార్‌లో మత మార్పిడులు చాలా వేగంగా జరుగుతున్నాయని ఆరోపించారు.
రష్యాలో వెలుగులోకి జాంబీ వైరస్
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఒక వైరస్ వెలుగులోకి వచ్చింది. ఒక మంచు ప్రాంతంలో శాస్త్రవేత్తలు 48,500 ఏళ్ల నాటి ‘జాంబీ వైరస్’ను గుర్తించారు. రష్యాలోని మంచు పొరల కింద లభ్యమైన నమూనాల్ని యూరప్ పరిశోధకులు పరీక్షించగా 13 రకాల హానికారకమైన సూక్ష్మజీవ జాతులను గుర్తించారు. తమ పరిశోధనల్లో ఇవి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లుగా తేలడంతో, శాస్త్రవేత్తలు వాటిని జాంబీ వైరస్‌లుగా భావిస్తున్నారు. రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఒకవేళ ఈ జాంబీ వైరస్‌లు బయటి వాతావరణంలోకి విడుదలైతే.. జంతువులకు, మానవాళికి పెను సమస్యగా పరిణమిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
NTR 31: ప్రశాంత్ నీల్ ప్లాన్ డిలే అవ్వకుండా ఉంటుందా?