ఇక మనం వేగం పెంచాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ మంత్రుల సమావేశంలో కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించిన ఆయన.. ఐదేళ్ల వైసీపీ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం.. ఇక మనం వేగం పెంచాల్సిన సమయం ఆసన్నమైంది.. అందుకే కొత్త టీమ్ ను ఏర్పాటు చేసుకున్నాం అన్నారు..
వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో అధికారులు, ప్రభుత్వ విభాగాల సన్నద్దతపై సమీక్షించారు.. రాష్ట్రంలో ఈ సీజన్ లో 676 ఎంఎం సరాసరి వర్షపాతానికి గాను ఇప్పటి వరకు 734 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యింది.. 18 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం, 8 జిల్లాల్లో సాధారణం, అంతకంటే తక్కవ వర్షపాతం నమోదు అయినట్టు వెల్లడించారు..