సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రమాద ఘటన తీవ్ర ఆవేదనకు గురి చేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అందాల విశాఖ సాగరతీరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ( TCS) మణిహారంగా మెరవనుంది. మెరుగైన జీతభత్యాలు అందించే 10 వేల ఐటీ ఉద్యోగాలు యువతకు లభించనున్నాయి. యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేష్, ఏపీకి ప్రఖ్యాత ఐటీ కంపెనీలు రప్పించి లక్షలాది మందికి స్థానికంగా ఉపాధి కల్పిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట నెరవేర్చే దిశగా విశ్వప్రయత్నాలు చేసి టాటా గ్రూపు చైర్మన్, పెద్దలను ఒప్పించి విశాఖకు టీసీఎస్ ని రప్పించారు.