ఏపీలో లిక్కర్ స్కాంపై సిట్ లోతైన విచారణ చేపడుతోంది. ప్రధానంగా లిక్కర్ స్కాం వెనుక ఎవరెవరు ఉన్నారు, లిక్కర్ డిస్టలరీస్ దగ్గర ముడుపులు ఎవరి నుంచి ఎవరికి చేరాయి, లిక్కర్ సేల్స్ లో ఎలా స్కామ్‌కు పాల్పడ్డారనే అనే అంశాలపై ప్రధానంగా సిట్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే సిట్ కీలక విషయాలను సేకరించింది. ఆ తర్వాతే వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి, విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చి విచారణ…
మద్యం కుంభకోణంలో రేపు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుఅవుతున్నారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి.. అంటే నోటీసుల్లో పేర్కొన్న దానికంటే ఒకరోజు ముందుగానే విచారణకు వెళ్లబోతున్నారు.. ఈ మేరకు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు సాయిరెడ్డి.. తొలుత ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు.. అయితే తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ఉండటంతో 17వ తేదీన విచారణకు వస్తున్నానని సమాచారం పంపించారు విజయ సాయిరెడ్డి.. ఇక, 17వ తేదీన విచారణకు…
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి షాక్ తగిలినట్టు అయ్యింది.. మద్యం కేసులో విచారణకు హాజరు కావాలంటూ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).. విజయవాడలో ఉన్న సిట్ కార్యాలయానికి ఈనెల 18వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్..
లిక్కర్ స్కాంపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు లిక్కర్ స్కామ్ జరిగిందన్న ఆయన.. ఇది జగమెరిగిన సత్యం.. ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఏపీ లిక్కర్ స్కామ్ ముందు పీనట్స్ అంత ఉందని పేర్కొన్నారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కలిశారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. పార్లమెంట్‌ను తాకిన మద్యం కుంభకోణం వ్యవహారంపై చర్చించనట్టుగా తెలుస్తోంది.. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందంటూ.. ఇటీవల పార్లమెంట్ లో లేవనెత్తారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు.. నాలుగు వేల కోట్ల రూపాయల సొమ్మును విదేశాలకు తరలించారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.. ఇక, నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షాని సైతం కలిసి ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు.. మద్యం కుంభకోణంపై చర్చించారట..
ఏపీలో లేని లిక్కర్ స్కాం పేరు చెప్పి కూటమి ప్రభుత్వం ఏదో ఒక రకంగా తప్పుడు ఆరోపణలతో మాజీ సీఎం వైఎస్ జగన్ ను అరెస్ట్ చేయాలని చూస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని.. ఎక్సైజ్ శాఖలో ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి గతంలో తనను బెదిరిస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తులకు విన్నవించారని.. ఇప్పుడు ఆయనను బెదిరించి తప్పుడు స్టేట్మెంట్ లు తీసుకున్నారన్నారు. అమాయకుల పేర్లు చెప్పి ఏదో…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవలకపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేశారు.. ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వ నిర్వాకాలు బయటపెట్టారు.. అయితే, మద్యం స్కాంలో ప్రభుత్వం దృష్టికి సంచలన వాస్తవాలు వస్తున్నాయట.. మద్యం శ్వేతపత్రంలో పొందుపరిచిన అంశాలకంటే భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ఆధారాలు బయటపడుతున్నాయట..
లిక్కర్ స్కామ్‌పై సంచలన నిర్ణయం తీసుకున్నారు.. వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సీఐడీ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. నగదు లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఈడీకి రిఫర్ చేస్తామని స్పష్టం చేశారు.
చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసింది సీఐడీ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై కొత్త కేసు నమోదు చేసింది సీఐడీ. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా చేర్చుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇక, సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది.