చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసింది సీఐడీ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై కొత్త కేసు నమోదు చేసింది సీఐడీ. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా చేర్చుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇక, సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది.