చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నిరసనలు తెలుపుతున్న టీడీపీ నేతల గృహానిర్బంధం పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఆ పార్టీ నేతలను గృహనిర్బంధం చేయడంపై వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిటిషన్ దాఖలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్తో పాటు మరో రెండు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ నెల 18లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది.
ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు అత్యవసర ఊరట దక్కలేదు. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణను ఉన్నత న్యాయస్థానం వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఇరువైపుల వాదనలు వినాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని ఆయన తరపున న్యాయవాదులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏపీ హైకోర్టులో ఈ కేసు విచారణ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
రీతి సాహ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. సీఐడి పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులో అరెస్టుల పర్వం మొదలయింది. బెంగాల్ విద్యార్థిని మృతి కేసులో ఇప్పటి వరకు నలుగురి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈనెల 17న ధర్నా చేసుకునేందుకు సీపీఎస్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. పలు షరతులతో కూడిన అనుమతిని ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది. ఈ ధర్నాలో నల్లబ్యాడ్జీలు ధరించి సీపీఎస్ ఉద్యోగులు నిరసన తెలియజేయనున్నారు.
ఏపీ విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నాకు అనుమతి కోరుతూ.. ఏపీ విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు.