Amaravati: రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు సకాలంలో కౌలు చెల్లించకపోవడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. రైతుల తరపున సీనియర్ న్యాయవాది మురళీధర్ వాదనలు వినిపించారు. పిటిషన్లను అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య ,రాజధాని రైతు పరిరక్షణ సమితి దాఖలు చేశాయి. ఇరువైపులా వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది.
Also Read: AP High Court: ప్రభుత్వ జీవోలు అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరమేంటి?
రైతులు సొసైటీల పేరుతో పిటీషన్లు దాఖలు చేయడంపై సీఆర్డీఏ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన చిన్న, సన్న కారు రైతుల సంఖ్య, వివరాలను న్యాయమూర్తి అడిగి తెలుసుకున్నారు. ఆ వివరాలు న్యాయమూర్తి ముందుంచారు రైతుల తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్. 28720 మంది రైతులు ఇచ్చిన భూమి 34396.96 ఎకరాలు అని కోర్టుకు వెల్లడించారు. వీరిలో ఎకరా లోపు 20176 మంది రైతులు ఉన్నట్లు కోర్టుకు తెలిపిన పిటిషనర్ న్యాయవాది తెలిపారు. 1 ఎకరా నుండి 2 ఎకరాల్లోపు వున్న రైతులు 4,217 మంది ఉన్నారని న్యాయవాది చెప్పారు.