SI Selection: ఎస్‌ఐ పోస్టుల భర్తీపై హైకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SI Selection: రాష్ట్రంలో ఎస్‌ఐ పోస్టుల భర్తీపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. అభ్యర్థుల ఎత్తు కొలిచే విషయంలో అనుసరించిన డిజిటల్ విధానం సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో 24 మంది పిటిషన్ దాఖలు చేశారు.. ఛాతీ, ఎత్తు కొలిచే విధానంలో డిజిటల్ విధానం వల్ల అనేక మంది అర్హులైన అభ్యర్థులు కూడా అర్హత కోల్పోయారని కోర్టుకు తెలిపారు పిటిషనర్.. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. హైకోర్టు పర్యవేక్షణలో కోర్టు ప్రాంగణంలో ఎత్తు, కొలతలు తీయాలని ఆదేశాలు జారీ చేసింది.. అయితే, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇచ్చిన కొలతలు కరెక్ట్ అయితే.. ఒక్కో పిటిషనర్ ఖర్చుల కింద లక్ష రూపాయలు చెల్లించాలంటూ ఆదేశించింది. కొలతలకు సిద్దంగా ఉన్న అభ్యర్థుల వివరాలు కోర్టుకు సమర్పించాలని పిటిషనర్‌ను సూచించిన హైకోర్టు.. తదుపరి విచారణ ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.
Read Also: Sitaram Yechury: తెలంగాణలో హంగ్ వస్తే కాంగ్రెస్ కు సీపీఎం మద్దతు
Also Read
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
- Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
- ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
- AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
మొత్తంగా ఏపీలో ఎస్‌ఐ పోస్టుల భర్తీ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు అయ్యింది.. 2018లో అర్హత సాధించిన తమను 2023 నోటిఫికేషన్‌లో అనర్హులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ వ్యాజ్యం దాఖలు చేసిన 24 మందికి హైకోర్టు పర్యవేక్షణలో, న్యాయస్థానం ప్రాంగణంలోనే ఎత్తు కొలతలు తీసేందుకు నిర్ణయించింది హైకోర్టు.. న్యాయమూర్తులు జస్టిస్ జి. నరేంద్ర, జస్టిస్ న్యాపతి విజయ్‌తో కూడిన ధర్మాసనం నవంబర్ 24న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌ఐ పోస్టుల భర్తీలో 2023 నోటిఫికేషన్ ప్రకారం శారీరక దారుఢ్య పరీక్షల్లో భాగంగా డిజిటల్‌మెషీన్‌తో ఎత్తును కొలవడాన్ని సవాలు చేస్తూ 95 మంది అభ్యర్థులు హైకోర్టులో గతంలో పిటిషన్లు వేయగా.. డిజిటల్ మెషీన్ల ద్వారా ఛాతి, ఎత్తు కొలతలు నిర్వహించడంతో తాము అనర్హులమయ్యామన్నారు. మాన్యువల్ విధానంలో కొలతలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీంతో.. పై విధంగా స్పందించిన ఏపీ హైకోర్టు.
తాజావార్తలు
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
ట్రెండింగ్
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!