CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో మొహమాటాలు లేవు.. గత ప్రభుత్వం ప్రశాంతమైన ప్రాంతాలను కూడా నేరమయం చేసింది.. నేరస్తులను పెంచి పోషించారు.. నెల్లూరు లాంటి చోట్ల లేడీ డాన్లను ఎప్పుడైనా చూశామా?.. ఇటువంటి సంస్కృతికి కారణం ఎవరు? అని అడిగారు. విజయనగరం, నెల్లూరు లాంటి జిల్లాలు ప్రశాంతతకు మారుపేరుగా ఉండేవి.. ఈ జిల్లాలకు ఎలాంటి అధికారులను ఎస్పీలుగా నియమించినా సరిపోయేది.. కానీ, గత పాలకుల వల్ల ఈ జిల్లాల్లో కూడా నేరస్తులు తయారయ్యారు.. నెల్లూరు లాంటి జిల్లాలో లేడీ డాన్లను తయారు చేశారంటే.. గత ఐదేళ్లు ఎలాంటి పాలన సాగిందో అర్థం చేసుకోవాలి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Flipkart 2025 Sale: రూ.4590 కి వాషింగ్ మెషీన్.. రూ.5999 కి స్మార్ట్ టీవీ.. అందుబాటులో సూపర్ ఆఫర్లు
ఇక, రాష్ట్రంలో లేడీ డాన్లు పెరిగి పోయారు.. వారి తోకలు కట్ చేస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో రౌడీ షీటర్లు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాజధాని రైతులు సమస్యలను అన్నింటినీ పరిష్కరిస్తాం.. అలాగే, రాజధాని పనుల్లో వేగం పెరిగింది.. నాతో రాజధాని రైతుల సమావేశం తరువాత మంచి ఫలితాలు వస్తున్నాయి.. రైతులు పూర్తిగా సహకరిస్తున్నారు.. రెండో ఫేజ్ భూ సేకరణకు కూడా రైతులు ముందుకు వచ్చారని తెలిపారు. ప్రజలు, రైతులు, ప్రభుత్వం అంతా సంతోషంగానే ఉన్నారు.. కొందరికి మాత్రం కడుపు మండుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.