Polavaram Project: నేడు పోలవరంలో కేంద్ర నిపుణుల బృందం పర్యటించనుంది. గ్యాప్-1, గ్యాప్-2 ప్రాంతాల్లో నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ పనుల నాణ్యత ఈ టీమ్ పరిశీలించనుంది.
Polavaram Project: రేపటి నుంచి పోలవరంలో కేంద్ర నిపుణుల బృందం పర్యటించనుంది. గ్యాప్-1, గ్యాప్-2 ప్రాంతాల్లో నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ పనుల నాణ్యత ఈ టీమ్ పరిశీలించనుంది. అల్లూరి జిల్లా దండంగి గ్రామం వద్ద స్పిల్వే సమీపంలో ఉంచిన మట్టి నిల్వల నుంచి శాంపిల్స్ సైతం సేకరించనున్నారు.
Minister Narayana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం రైతులు 34 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారు అని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ భూముల్లోనే అసెంబ్లీ, హైకోర్టు, అడ్మినిస్ట్రేటివ్ భవనాల నిర్మాణం కోసం డిజైన్ కూడా రెడీ చేయడం జరిగిందన్నారు.
AP Cabinet: ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది. అమరావతి రాజధాని నిర్మాణంలో ఫేజ్- 2 భూ సేకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
రాజధానిని స్మశానం అన్నారు.. ఈ రోజు స్వేచ్చా వాతావరణంలో మాట్లాడుకుంటున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2019 నుంచి 2024 వరకూ భయంకరమైన వాతావరణం ఉంది.. నా జీవితంలో అలాంటిది ఎప్పుడూ చూడలేదు.. నేనుకూడా బయటకు రాలేని పరిస్థితి ఉండేదన్నారు.. హెలికాప్టర్ లో వస్తే కింద ఉన్న చెట్లను నరికేశారు.
హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా బాణాసంచా తయారీ కేంద్రాలులో సేఫ్టీ ఆడిట్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయం అన్నారు. ఎల్జీ పాలిమర్ ప్రమాదంలో మృతులకు కోటి రూపాయలు ప్రకటించిన గత ప్రభుత్వం ఇప్పటి వరకు పరిహారం అందజేయలేదన్నారు.
వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు మాట్లాడుతూ.. చంద్రబాబు ఏ దమ్ముతో అంబేడ్కర్ స్మృతి వనం ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నాడు? అని ప్రశ్నించారు. అంబేడ్కర్ స్మృతి వనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి చంద్రబాబుకి ఏ హక్కు ఉందన్నారు.
Amaravati: అమరావతి రాజధాని కోసం మరో 30 వేలు భూ సమీకరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 5000 వేల ఎకరాల భూమి అవసరం అని అంచనా వేస్తుంది.
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ( ఏప్రిల్ 14న ) గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రజా సమస్యలపై ప్రధానంగా చర్చిస్తారు.