AP Mega DSC 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ ఈ రోజు (ఏప్రిల్ 20) విడుదల చేయనుంది. మొత్తం 16,347 టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను సైతం రిలీజ్ చేయనుంది. మెగా డీఎస్సీకి సంబంధించిన జీవోలు, ఖాళీల వివరాలు, పరీక్షల షెడ్యూల్, సిలబస్ లాంటి ఇతర వివరాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఇవాళ ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచనున్నారు. డీఎస్సీ నేపథ్యంలో అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: LSG vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై లక్నో విజయం
మెగా డీఎస్సీ 2025 షెడ్యూల్..
* ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్‌లైన్ ఫీజుల చెల్లింపులు, దరఖాస్తులు..
* మే 20 నుంచి మాక్ టెస్ట్‌లు
* మే 30 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
* జూన్ 6 నుంచి జులై 6 వరకు డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలు
* పరీక్షలు పూర్తైన రెండో రోజే ప్రాథమిక ‘కీ’ విడుదల
* ఆ తర్వాత ఏడు రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ
* అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుది ‘కీ’ విడుదల
* ఫైనల్ కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత విడుదల చేయనున్నారు.