AP Budget 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే విషయమై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ వరుస సమావేశాలు కానుంది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో బదిలీలు చేపట్టనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక, బదిలీల మార్గదర్శకాలపై తుది కసరత్తు జరుగుతోంది.. ఆఫీస్ బేరర్ల పేరుతో బదిలీలను తప్పించుకునేలా కొందరు వైసీపీ అనుకూల ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.. ఆఫీస్ బేరర్లకు తొమ్మిదేళ్ల పాటు బదిలీల నుంచి వెసులుబాటు కల్పించే జీవోను అడ్డం పెట్టుకుంటున్నారట పలువురు ఉద్యోగులు.
AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేరళలోని వయనాడ్ బాధితుల కోసం 10 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 10 కోట్లను కేరళ ప్రభుత్వానికి ఇవాళ (శుక్రవారం) అందజేసింది.
పోలవరం ప్రాజెక్టు సవాళ్లపై అధ్యయనం చేసిన విదేశీ నిపుణుల బృందం కీలక సూచనలు చేసింది. వర్షాకాలం దాటగానే పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు వీలుగా డిజైన్, నిర్మాణ అంశాలు చర్చించేందుకు వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందులో పోలవరం ప్రాజెక్ట్ డిజైనర్, ప్రాజెక్టను పర్యవేక్షించే ఇంజినీర్ల బృందం, విదేశీ నిపుణుల బృందం ఉండాలని సూచించింది.
AP Govt: ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ కార్యాలయాలపై 300 మెగావాట్ల సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుపై ఒప్పందం చేసుకుంది.
AP Super Speciality Hospitals: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నోటీసులు ఇచ్చాయి. మా బకాయిలు మాకు ఇచ్చే వరకు ఇక ఆరోగ్యశ్రీ సేవలు నడపలేం అని వెల్లడించాయి.
రైతులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గత రబీ సీజన్లో ధాన్యం విక్రయించి.. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల కోసం ఎదురుచూస్తున్న రైతులకు తీపికబురు చెప్పింది కూటమి ప్రభుత్వం.. పాత బకాయిలను అందించడానికి ఇవాళ్టి నుంచి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ (APNTF) విభాగం ఏర్పాటు దిశగా కసరత్తు ప్రారంభమైంది.. డ్రగ్స్, గంజాయి నివారణ చర్యలను మిషన్ ఆఫ్ ద ఏపీ అని పేర్కొంటోంది ఆంధ్ప్రదేశ్ ప్రభుత్వం.. ఏడీజీ లేదా ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో APNTF ఏర్పాటు చేయనున్నారు.. రాజధానిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్.. 26 జిల్లాల్లో నార్కోటిక్ కంట్రోస్ సెల్స్ ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది కూటమి సర్కార్.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నిధులను భారీగా పెంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.. గ్రామగ్రామాన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు..
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళనకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో 10 వేల 960 గ్రామ సచివాలయాలు, 4 వేల 44 వార్డు సచివాలయాలు ఉండగా.. దాదాపు లక్షా 61 వేల మంది గ్రామ, వార్డు సెక్రటరీలు ఉన్నారు. అవసరాలకు అనుగుణంగా గ్రామ, వార్డు సెక్రటరీలను వినియోగించుకునేలా కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం..