కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన చాలా బాగుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో మాట్లాడుతూ.. ప్రజలు ఏం కోరుకున్నారో అలాంటి పాలన అందించగలిగామన్నారు.
తిరుమల లడ్డులో కల్తీ నెయ్యుని వినియోగించారని.. గత ప్రభుత్వ హయాంలోని టీటీడీ బోర్డు ఆమోదించిన టెండర్ వల్ల కల్తీ నెయ్యి వినియోగం జరిగిందనే విషయాన్ని ఈవో శ్యామల రావు నిర్ధారించారు. జాతీయ స్థాయిలో పేరొందిన NDDB ల్యాబ్ నుంచి సర్టిఫికెట్ కూడా వచ్చేసింది. దీనిపై రాజకీయంగా దుమారం రేగుతోంది. అధికార టీడీపీ.. మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ అపచారం నువ్వు చేశావంటే నువ్వు చేశావని దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.
AP Government 100 Days: ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎన్డిఏ శాసనసభా పక్ష సమావేశం రేపు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో జరగనుంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి హాజరయ్యే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, లోటుపాట్లపై చర్చించనున్నారు ఎన్డిఏ శాసనసభా పక్ష నేతలు. ఈ నెల 20 నుంచి 26 వరకు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో కువైట్‌లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతోన్న కవిత.. స్వదేశానికి చేరుకుంది.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవతో కువైట్ నుంచి క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం నారాయణరెడ్డిగారిపల్లికు చెందిన మహిళ తిరుపతి కవిత... బతుకుతెరువు కోసం కువైట్ వెళ్లి అక్కడ తీవ్ర ఇబ్బందులు పడిన బాధితురాలు..
ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సంస్థలకు జరపాల్సిన భూ కేటాయింపుల పరిశీలనకు కేబినెట్ సబ్ కమిటీని సర్కారు ఏర్పాటు చేసింది.
ఉద్యోగుల బదిలీల గడువును మరోసారి పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 22 తేదీ వరకు గడువును పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక, సెప్టెంబర్ 23 తేదీ నుంచి బదిలీలపై నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది.. ఎక్సైజ్ శాఖ బదిలీల గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.. అక్టోబర్ 1 తేదీన ఆ శాఖ బదిలీల్లో నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
గత ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. సొంత ఆదాయం పెంచుకునేలా.. ప్రభుత్వం ఆదాయానికి గండి కొట్టేలా గత ప్రభుత్వం మద్యం పాలసీ చేసుకుందన్నారు.
AP Govt: స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో-సెబ్‌ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. సెబ్‌ను ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన 12 జీవోలను ప్రభుత్వం రద్దు చేసింది. సెబ్ విభాగానికి గత ప్రభుత్వం కేటాయించిన సిబ్బందిని రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.