కందిపప్పు, చక్కెర ధరలు భారీగా తగ్గించి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, ఈ నిర్ణయంతో రేషన్‌కార్డు ఉన్నవారికే లబ్ధిచేకూరనుంది.. ఎందుకంటే.. రాష్ట్ర ప్రజలకు పౌరసరఫరాల శాఖ.. కందిపప్పు, చక్కెర ధరలను తగ్గించింది. నెల వ్యవధిలోనే రెండు సార్లు కందిపప్పు ధరలను తగ్గించారు.
దసరా తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మావోలతో సహా నాలుగు కుంకీ ఏనుగులను పంపడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు కర్ణాటక మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రే.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆరు కీలకమైన ఒప్పందాలు జరిగాయి..
రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, హోం, నైపుణ్యాభివృద్ధి, సాంఘిక, బీసీ, గిరిజన మహిళా శిశు సంక్షేమం విభిన్న ప్రతిభా వంతుల శాఖలతో పాటు, గృహ నిర్మాణ, వ్యవసాయ, వైద్య ఆరోగ్య, మత్స్య శాఖలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరును,…
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి.. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని కృష్ణా నది, బుడమేరు వరద అతలాకుతలం చేసింది.. పూర్తిస్థాయిలో సహాయక చర్యలు నిర్వహించిన ప్రభుత్వం.. ఇప్పుడు నష్ట పరిహారం పంపిణీపై దృష్టిసారించింది.. ఈ రోజు నాలుగు లక్షల మంది బాధితుల ఖాతాల్లో రూ. 602 కోట్లు జమచేసింది ప్రభుత్వం..
ఏపీలో వివిధ కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం డైరెక్టర్లను నియమించింది. పౌరసరఫరాల శాఖ, పద్మశాలి సంక్షేమ, అభివృద్ధి కార్పొరోషన్లల్లో చెరో 15 మంది సభ్యులను నియమించింది. అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 13 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం తొలి భూ కేటాయింపు చేపట్టింది. ఎంఎస్ఎంఈ రెండో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు 20 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 20 ఎకరాల భూమిని కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం ఉచితంగానే కేటాయించింది
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. నేతలు చాలా మంది నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తూ వస్తున్నారు.. అయితే, వారికి గుడ్‌న్యూస్ చెబుతూ.. వివిధ నామినేటేడ్ పోస్టులను భర్తీ చేసింది చంద్రబాబు సర్కార్.. వివిధ కార్పొరేషన్లకు చైర్పర్సన్లను నియమించింది.. ఒకేసారి మొత్తం 20 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులు భర్తీ చేసింది.. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోలేక పోయిన వారికి.. పొత్తుల్లో టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రధాన్యత కల్పించింది ప్రభుత్వం..…
వరద, పంట నష్టంపై బాధితులకు ఇవ్వాల్సిన పరిహారం ప్యాకేజీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలో మునిగిన ఇళ్లకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ జీవో జారీ చేసింది.
అన్నవరం దేవస్థానానికి సరఫరా చేసే నెయ్యి ధర విషయంలో ఆరా తీస్తోంది ప్రభుత్వం.. ఏలూరు జిల్లా లక్కవరంలోని రైతు డైరీ నుంచి కిలో నెయ్యి 538.60 రూపాయలకు కొనుగోలు చేస్తోంది దేవస్థానం.. అయితే, అదే నెయ్యి విశాఖపట్నం జిల్లా సింహాచలం దేవస్థానానికి కిలో 385.41 రూపాయలకు చొప్పున విక్రయిస్తోంది రైతు డైరీ.. రెండు ఆలయాలకు ఇచ్చే ధరల్లో 153 రూపాయల వ్యత్యాసం ఉంది.. ఒకే క్వాలిటీ, ఒకే కంపెనీ... రెండు దేవాలయాల్లో ఎందుకు అంత తేడాతో టెండర్లు…