CM Chandrababu: పీడీఎస్ అక్రమ రవాణాపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తొలి రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. పీడీఎస్ అక్రమ రవాణాను సీరియస్‌గా తీసుకుంటున్నాం అన్నారు.. రీసైక్లింగ్ నుంచి స్మగ్లింగ్ కు దారి తీస్తుందన్నారు.. పీడీఎస్ స్మగ్లింగ్ పైన డీ&ఎస్ కింద సెక్షన 301 కిందకు తెచ్చాం.. పీడీఎస్ రైస్ రీసైక్లింగ్ ఆపేయాలని స్పష్టం చేశారు… పీడీఎస్ స్మగ్లింగ్ పైన పీడీ యాక్టు తీసుకురావాలి.. రెగ్యలర్ రైస్, పీడీఎస్ రైస్ లను కలిపి అమ్మేస్తున్నారనేది ఒక వాదనగా ఉందన్నారు.. ఝార్ఖండ్ నుంచి కూడా పీడీఎస్ వస్తోంది.. పీడీఎస్ లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకూడదని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. ఇక, కూకటివేళ్లతో సహా పీడీఎస్ రైస్ మాఫియాను లేకుండా చేయాలి.. ప్రజలు తినే బియ్యాన్నే అందుబాటులోకి తేవాలని సూచించారు మంత్రి పయ్యావుల.. వేరే దేశాల నుంచి కూడా పీడీఎస్ రాకూడదని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు..
Read Also: Youtube Auto Dubbing Feature: అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చిన యూట్యూబ్.. ఇకపై ఏ భాషలోనైనా
ఇక, వాటర్ వినియోగంపై మాట్లాడుతూ.. రెయిన్ ఫాల్ బాగుంది కనుక గ్రౌండ్ వాటర్ బాగుంది.. ఒకటి ఉపరితల నీరు, రెండు అండర్ గ్రౌండ్ వాటర్.. వాటర్ రీఛార్జి మీద దృష్టి పెట్టాలని కలెక్టర్లకు సూచించారు సీఎం చంద్రబాబు.. కలెక్టర్లు అందరూ నరేగా పనుల్లో నీటి అవసరాల పనులను తీసుకోవాలి.. రాబోయే రెండు సీజన్లలో ప్రతీ జిల్లాలో వానాకాలం నాటికి 8 మీటర్ల నీటి నిల్వ ఉండాలి.. పోలవరం పూర్తయ్యేలోపే, పోలవరం నుంచి కృష్ణకు నీరు తేవాలని ఆదేశించారు.. లెఫ్ట్ మెయిన్ కెనాల్ వచ్చే ఏడాదికి విశాఖ వరకూ వస్తుందన్నారు.. ప్రతీ సంవత్సరం వాటర్ మేనేజ్మెంట్ కచ్చితంగా జరగాలి.. ప్రతీ ఇంటికి ట్యాప్ వాటర్ రిజర్వాయర్ల నుంచి ఇవ్వాలన్నారు.. ప్రాజెక్టుల గేట్ల మెయింటెనెన్స్ కూడా జాగ్రత్తగా చేయాలి.. కృష్ణా నది రైట్ బ్యాంకు డ్యామేజీపై ఒక నిర్ణయం తీసుకుందాం.. మెయింటెనెన్స్ లేకపోవడంతో పనికిరాకుండా పోతున్నాయి.. అన్నింటి మెయింటెనెన్స్ PPP విధానంలో ఔట్ సోర్సింగ్ ద్వారా చేద్దాం అన్నారు.. ఆర్ధిక నిరోధాలతో పనులు ఆగకుండా చూస్తున్నాం.. ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేస్తున్నాం అని వివరించారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..