రేపటి నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రేపు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రేపు ఉదయం 9 గంటలకు బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనునుంది. ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది
ఏపీ రాజధాని అమరావతి నగరం సుస్థిరాభివృద్ది, నగర నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు లు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా రూ.15 వేల కోట్ల రూపాయల మేర రుణ సహకారాన్ని అందించనున్నట్టు స్పష్టం చేసింది.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి నెలకొన్నాయని.. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల హామీలు అమలు చేయటం లేదు కాబట్టి ప్రశ్నించే స్వరం లేకుండా అణిచి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతున్నా హామీల అమలు లేదని మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు సోము వీర్రాజు. అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం లో ప్రజా పాలన సాగుతుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచి అమలు చేస్తున్నారన్నారు.
ఏపీ కేబినెట్ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనున్నది. ముఖ్యంగా, 1982 ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోబడే అవకాశం ఉంది.
ఏపీలో మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నాయని.. 120 రోజుల్లో 110 ఘటనలు జరిగాయని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. స్కూల్ నుంచి వస్తున్న అమ్మాయికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారని ఆమె తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడికి పోయారంటూ ప్రశ్నించారు. రేప్ జరిగింది అన్న విషయాన్ని కప్పిపెట్టడానికి అనేక హాస్పిటల్స్కి తిప్పారని ఆరోపించారు.
ఏపీ సచివాలయంలో ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ భేటీ అయింది. రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల, వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బియ్యం, కందిపప్పు, టమాటా, ఉల్లి ధరల నియంత్రణపై చర్చించారు.
ఏపీలో నార్కోటిక్ డ్రగ్స్ నియంత్రణ, నిర్మూలన, అక్రమ మద్యం నివారణ, డ్రగ్స్, మద్యం బాధితుల పునరావాసంపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోమ్, మానవ వనరుల, ఎక్సైజ్, గిరిజన సంక్షేమం, వైద్యారోగ్య శాఖ మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పుటి నుంచి ఒక మాఫియా పాలనా చేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆటవిక రాజ్యం సృష్టిస్తున్నారని... వీరి అరాచకాలపై ఢిల్లీలో పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. ఇంటింటికి డబ్బులు, పథకాలు వచ్చేవీ అవన్నీ మాయం అయ్యాయన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై సర్కార్ సీరియస్ అయింది. అక్రమంగా ఇసుక నిల్వ ఉంచిన, రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. టెక్నాలజీ సాయంతో పటిష్టమైన నిఘా పెట్టాలని ఆదేశించింది. నందిగామ, జగ్గయ్యపేటలో ఇసుక మాఫియా ఆగడాలపై వరుస ఫిర్యాదుల నేపథ్యంలో సీపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.