ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ దృష్టి సారించారని, ఈరోజు, రేపటి లోగా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. రెండు రోజుల విద్యుత్ కోతలపై టీడీపీ నానా గోల చేస్తుంది. టీడీపీ హయాంలో ఉన్న వేల కోట్ల రూపాయల బకాయిలు మాకు అప్పజెప్పి వెళ్లారు. అన్నీ సమస్యలు పరిష్కరించాం, రెండు రోజుల్లో ఏ సమస్య లేకుండా చేస్తాం. పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన చేసిన సత్యసాయి జిల్లాపై బాలకృష్ణ అంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదు. ఆయన…
ఏపీలో పీఆర్సీ వ్యవహారంలో చిక్కుముడులు వీడకపోవడంతో జనవరి నెల జీతాల పరిస్థితిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికీ ప్రాసెస్ కాని జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేసే బాధ్యతను డీడీఓలకంటే పైస్థాయి అధికారులకు అప్పగించారు. ఎలాగైనా జీతాల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశాలు రావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు వివిధ జిల్లాల కలెక్టర్లు. జీతాల బిల్లులు ప్రాసెస్ కాకుంటే ప్రత్యామ్నాయాలు చూడాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు డీడీఓలకంటే పై స్థాయి అధికారులకు బాధ్యతల…
ఏపీలో పీఆర్సీ వివాదం పీటముడి వీడడం లేదు. పీఆర్సీ వ్యవహారం, ఉద్యోగుల ఆందోళనల పై ప్రభుత్వ సలహాదారు సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు చెల్లిస్తాం అన్నారాయన. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు, ఉద్యోగ సంఘ నాయకులు పెట్టిన మూడు డిమాండ్లకు సంబంధం లేదన్నారు. ముఖ్యమైన హెచ్ఆర్ఏ సవరణ అంశాన్ని ఉద్యోగ సంఘాలు ప్రస్తావించటం లేదు. ఉద్యోగ సంఘాలు మంత్రుల కమిటీతో చర్చలకు వస్తే పాత జీతాలు వేసే అంశాన్ని…
పీఆర్సీ విషయంలో ఏపీ ఉద్యోగ సంఘాలు పట్టుదలగా వున్నాయి. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా పీఆర్సీ సాధన సమితి పిలుపుమేరకు సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా నిర్ణయించడంతో కీలకంగా మారింది. ప్రభుత్వంలో విలీనం ఎందుకు తీసుకున్నామా అని ఆలోచించే పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నిర్ణయం ప్రభుత్వానికి మింగుడుపడడం లేదు. పీఆర్సీ సాధన సమితికి పూర్తి…
విజయవాడలో పీఆర్సీ సాధన సమితి భేటీ ముగిసింది. ఈ నేపథ్యంలో పీఆర్సీ సాధన సమితి కీలక నిర్ణయం తీసుకుంది. పీఆర్సీపై ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు రద్దు చేసేవరకు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లకూడదని ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు. ఈ మేరకు జీవోలు రద్దు చేయాలని మంత్రుల కమిటీకి లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో బండి శ్రీనివాస్, బొప్పరాజు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డిలు పాల్గొన్నారు. Read Also: వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం…
ఏపీలో ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి రెడీ అవుతున్నాయి. ఉద్యోగసంఘాలన్నీ కలిపి రేపు మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీసులు ఇస్తామని ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీలు తెలిపాయి. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమరానికి సై అంటున్నాయి అన్ని సంఘాలు. పీఆర్సీ వల్ల కలిగిన నష్టాలను పూడ్చాలని డిమాండ్ చేశాయి. నాలుగుజీవోలు రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా వుంటే… ఏపీ ఉద్యోగ సంఘ నేతలకు జీఏడీ సెక్రటరీ శశి భూషణ్ ఫోన్ చేశారు. రేపు మంత్రులతో…
ఏపీలో పీఆర్సీ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. నూతన పీఆర్సీ జీవోలను సోమవారం రాత్రి ప్రభుత్వం విడుదల చేయగా అందులోని పలు అంశాలను ఉద్యోగులను కలవరపరిచాయి. ముఖ్యంగా హెచ్ఆర్ఏను 30 శాతం నుంచి 16 శాతానికి తగ్గించడంతో ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ పీఆర్సీ తమకు అక్కర్లేదని… పాత పీఆర్సీనే కంటిన్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తమను సంప్రదించకుండా పీఆర్సీపై విడుదల చేసిన జీవోలను వ్యతిరేకిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు ప్రకటించారు. రాష్ట్ర…
ఎప్పటినుంచి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీపై ఏపీ సీఎస్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు పీఆర్సీతో పాటు తమ న్యాయమైన 71 డిమాండ్లను కూడా పరిశీలించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం సీఎస్ నిర్వహిస్తున్న ప్రెస్ మీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఏపీలో ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం నిరసనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా విజయవాడలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీఆర్సీ సహా న్యాయమైన 71 డిమాండ్లను పరిష్కరిస్తేనే పోరాటం ఆపుతామని వారు స్పష్టం చేశారు. సచివాలయ…
పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీలో ఉద్యోగ సంఘాల జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. మొత్తం 71 డిమాండ్లతో ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. కర్నూలు, ఏలూరు, పాడేరు తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. భోజన విరామ సమయంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. కర్నూలులో ఉద్యోగ సంఘాలు నిర్వహించిన ఆందోళనల్లో ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. Read…