దేశమంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వైపు ఆసక్తిగా చూస్తోంది. గెలుపు ఎవరిదనే దానిపై హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. చర్చలే కాదు.. వేల కోట్ల రూపాయల బెట్టింగులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ చేసిన బెట్టింగ్ రాయుళ్ళు కోట్ల రూపాయల బెట్టింగులు వేస్తున్నారు.
ఎన్నికల ప్రచార పర్వం తుది అంకానికి చేరుకుంది. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ప్రచార పర్వానికి ఫుల్ స్టాప్ పడుతుంది. మైకులు బంద్ కాబోతున్నాయి. సుధీర్ఘంగా సాగిన ప్రచారానికి తెరపడబోతోంది. పార్టీలకు మిగిలింది కొన్ని గంటలే. ఈ సమయాన్ని పక్కాగా ఉపయోగించుకుని ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహ రచన చేస్తున్నాయి. చివరిరోజు అగ్రనేతల ప్రచారాలతో హోరెత్తించనున్నాయి.
పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా కలిగిరి మండలంలోని దూబగుంట, కృష్ణారెడ్డి పాలెం గ్రామాల్లో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం రోలుపడి, ఎరుకోపాడు, చింతలపాడు, గానుగపాడు, కోమ్మిరెడ్డి పల్లి, ముష్టికుంట్ల, అక్కపాలెం, కాకర్ల గ్రామాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని నందిగామ మండలంలోని రాఘవపురం, పల్లగిరి, కమ్మవారిపాలెం గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
చంద్రబాబు మళ్లీ ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతారు.. ఏపీ నుంచి 25 ఎంపీలు మా కూటమికి వస్తారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. ఏపీకి వచ్చిన ఆయన.. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు.. ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రముఖంగా చర్చించారు.. సీఎం వైఎస్ జగన్‌పై రాయి దాడి ఘటన సహా ఇతర అంశాలపై కూడా సుదీర్ఘ చర్చ సాగింది.
వింజమూరు మండల కేంద్రంలో శుక్రవారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్యం కోసం తలపెట్టిన ప్రజాగళం దద్దరిల్లింది. ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో.. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుండి తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, బీజేపీ నాయకులు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రజాగళం సభకు తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలని జనం చంద్రబాబు ప్రసంగానికి జేజేలు పలికారు. చంద్రబాబు నాయుడు మాటలు ఆసక్తిగా విన్నారు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు.…